'కల్కి 2898 AD' మూవీపై రాజమౌళి ట్వీట్.. ఆ ప్రశ్నకు నెటిజన్ల సెటైర్లు

ట్వీట్‌లో చివరలో జక్కన్న అడిగిన ఓ ప్రశ్నకు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  22 July 2023 8:30 AM IST
Rajamouli, Tweet,  Parbhas,  Kalki 2898 AD,

'కల్కి 2898 AD' మూవీపై రాజమౌళి ట్వీట్.. ఆ ప్రశ్నకు నెటిజన్ల సెటైర్లు

రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ చిత్రం ప్రాజెక్ట్‌-కే సినిమాకు 'కల్కి 2898 AD' అనే టైటిల్‌ను అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే.. సినిమా నుంచి గ్లింప్స్‌ వీడియోను కూడా రిలీజ్‌ చేశారు. ఈ వీడియో అందరినీ ఎంతో ఆకట్టుకుంది. సైన్స్‌ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న 'కల్కి 2898 AD' సినిమాలో ప్రభాస్‌ సూపర్‌ హీరోగా కనిపించనున్నారు. హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా కాలిఫోర్నియాలోన కామిక్‌ కాన్‌లో గ్రాండ్‌గా ఫస్ట్‌ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా ఈ సినిమా గురించి ఒక ట్వీట్‌ చేశారు. అంతాబాగానే ఉన్నా తన ట్వీట్‌లో చివరలో జక్కన్న అడిగిన ఓ ప్రశ్నకు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

మొదట్నుంచి ప్రభాస్‌ 'కల్కి 2898 AD' నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్‌ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా వచ్చిన గ్లింప్స్‌ కూడా అదే రేంజ్‌లో ఆకట్టుకుంది. ప్రభాస్‌ అభిమానులు, నెటిజన్లు, సినిమా ప్రేక్షకులు, సెలబ్రిటీలు కూడా ఈ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. ఇండస్ట్రీలోని టాప్‌ సెలబ్రిటీలంతా కల్కి సినిమా గురించే మాట్లాడుతున్నారు. పొగడ్తలతో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి కూడా కల్కి మూవీపై స్పెషల్‌ ట్వీట్‌ చేశారు. కల్కి టీజర్ చూసిన తర్వాత రాజమౌళి ఇలా ట్వీట్‌ చేశారు. 'గ్రేట్‌ జాబ్‌. అద్భుతమైన భవిష్యత్తు సినిమాను తీస్తున్నావు. ఇది చాలా కష్టం. కానీ మీరు పాజిబుల్‌ చేస్తున్నారు. డార్లింగ్‌ లుక్స్‌ చాలా బాగున్నాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలి ఉంది. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు?' అంటూ ట్వీట్‌ చేశారు. అయితే.. రాజమళి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అంతా బాగానే ఉన్నా నెటిజన్లు రాజమౌళి లాస్ట్‌లో అడిగిన ప్రశ్నగురించే మాట్లాడుకుంటున్నారు.

సాధారణంగా రాజమౌళి సినిమాలే చాలా ఆలస్యగా విడుదల అవుతుంటాయి. ఎప్పుడూ రాజమౌళినే మీ సినిమా ఎప్పుడు రిలీజ్‌ సార్ అంటూ అడుగుతుంటారు. అలాంటిది రాజమౌళి మరో సినిమా గురించి అడగడంతో సరదాగా కామెంట్లు పెడుతున్నారు. రిలీజ్‌ డేట్‌ గురించి ఎవరు అడుగుతున్నారో చూడండి అంటూ బహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్‌ పెట్టారు. అదే ట్వీట్‌ను హరీశ్‌ శంకర్‌ కూడా రీట్వీట్‌ చేస్తూ నిజమే, బాగా చెప్పారు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇలా ప్రముఖులే కాదు.. ఇతర నెటిజన్లు కూడా ఇదే విధంగా సరదా కామెంట్స్‌ చేస్తున్నారు.

Next Story