పుష్ప రాజ్.. మూడు రోజులలో ఇంత విధ్వంసం సృష్టించాడా..?

Pushpa Third Day collections in world wide.బాక్సాఫీస్ వ‌ద్ద మూడో రోజు కూడా 'పుష్ప' సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది.

By M.S.R  Published on  20 Dec 2021 7:44 AM GMT
పుష్ప రాజ్.. మూడు రోజులలో ఇంత విధ్వంసం సృష్టించాడా..?

బాక్సాఫీస్ వ‌ద్ద 'పుష్ప' సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ 'పుష్ప' సినిమా శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ సినిమా మూడో రోజు (ఆదివారం) కూడా రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిందని, 2021లో ఇండియాలో అత్య‌ధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింద‌ని పుష్ప టీమ్ తెలిపింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్‌ అయ్యింది. రెండు రోజుల్లోనే 'పుష్ప' సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లను కొల్లగొట్టింది. డిసెంబర్ 17న ఐదు భాషల్లో పాన్-ఇండియాగా విడుదలైంది. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం ప్రాంతానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ల జీవితాల ఆధారంగా రూపొందించబడింది. విడుదలైన రెండవ రోజు పుష్ప: ది రైజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కును దాటింది.

మూడు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం రూ.173 కోట్లు సాధించింద‌ని చిత్ర టీమ్ వివ‌రించింది. క‌రోనా స‌మ‌యంలోనూ గ‌త రికార్డుల‌న్నింటినీ 'పుష్ప' బ‌‌ద్ద‌లు కొడుతూ దూసుకుపోతోంది. నిన్న, మొన్న సెల‌వు దినాలు కావ‌డంతో పుష్ప‌ను చూడ‌డానికి ప్రేక్ష‌కులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. హిందీలో పుష్ప సినిమాకు చెప్పుకోద‌గ్గ వ‌సూళ్లు వస్తున్నాయి. శుక్ర‌వారం రూ.3 కోట్లు, ఆదివారం రూ.4 కోట్లు, ఆదివారం రూ.5 కోట్ల గ్రాస్ సాధించింది పుష్ప సినిమా. హిందీలో మూడు రోజుల్లో మొత్తం రూ.12 కోట్లు రాబ‌ట్టిందని సినీ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ తెలిపారు. హాలీవుడ్ లో స్పైడర్ మ్యాన్, భారత్ లో 'పుష్ప' సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. మొదట సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. చాలా ప్రాంతాల ప్రజలకు సినిమా నచ్చేసింది. క్లైమాక్స్, సౌండ్ విషయంలో మరికొంత శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఉండేదని అభిప్రాయ పడుతూ ఉన్నారు.

Next Story
Share it