బన్నీ బర్త్‌డేకు 'పుష్ప-2' నుంచి అదిరిపోయే గిఫ్ట్

తాజాగా పుష్ప-ది రూల్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌ ను ఇచ్చింది చిత్ర బృందం.

By Srikanth Gundamalla  Published on  2 April 2024 5:30 PM IST
pushpa the rule, movie, crazy update, allu arjun, sukumar,

 బన్నీ బర్త్‌డేకు 'పుష్ప-2' నుంచి అదిరిపోయే గిఫ్ట్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన 'పుష్ప' సినిమా ఎంతో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో యాక్టింగ్‌కు గాను ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. సుకుమార్‌ ఇప్పుడు పుష్ప-ది రైజ్‌కు సీక్వెల్‌గా పుష్ఫ-ది రూల్‌ ను పార్ట్‌-2గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఫ్యాన్స్‌లో మరింత హైప్‌ను తీసుకొచ్చాయి. తాజాగా పుష్ప-ది రూల్‌ నుంచి క్రేజీ అప్‌డేట్‌ ను ఇచ్చింది చిత్ర బృందం.

ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు. అయితే.. బన్నీ బర్త్‌డే సందర్భంగా పుష్ప-2 చిత్ర యూనిట్‌ అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న పుష్ప-ది రూల్‌ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. పుష్ప మాస్‌ జాతర కోసం వేచి ఉండండి అంటూ మూవీ యూనిట్‌ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ను అభిమానులు తెగ షేర్‌ చేస్తూ.. లైక్స్‌ కొడుతున్నారు. టీజర్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది క్రేజీ అప్‌డేట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా పుష్ప సినిమా మొదటి పార్ట్‌ 2021లో విడుదలైన విషయం తెలిసిందే. సూపర్‌ హిట్‌గా నిలిచింది. పాటలు.. యాక్షన్.. యాక్టింగ్.. కథ ఇలా అన్నింటికీ ఫుల్‌ మార్క్స్‌ పడ్డాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ పక్కన హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించింది. ఈ సినిమా నుంచి అల్లు అర్జున్‌ గంగమ్మ తల్లి గెటప్‌ అయితే సోషల్‌ మీడియాను ఊపేసింది. అలాగే చిత్ర యూనిట్‌ కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఇటీవల రష్మిక కూడా పుష్ప ది రూల్‌ గురించి మాట్లాడారు. తాను పార్ట్‌-2లో పుష్పకు భార్యగా కనిపిస్తానని చెప్పారు. ఎన్నో బాధ్యతలు తనపై ఉంటాయనీ.. ఈ సీక్వెల్‌ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇక పుష్ప ది రూల్‌ సినిమాను ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.


Next Story