పుష్ప-2.. డెడ్ లైన్ దగ్గర పడుతోంది మచ్చా!!
దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప-2 సినిమా ఒకటి.
By Srikanth Gundamalla Published on 29 April 2024 3:15 PM ISTపుష్ప-2.. డెడ్ లైన్ దగ్గర పడుతోంది మచ్చా!!
దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప-2 సినిమా ఒకటి. ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులన్నిటినీ బద్దలు కొట్టడం గ్యారెంటీ అని భావిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్, రష్మిక మందాన నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా.. పుష్ప: ది రైజ్ చిత్రానికి సీక్వెల్. పుష్ప-1 లోని పాటలు, మ్యానరిజమ్స్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. మొదటి పార్ట్ ను మించి పుష్ప-2 ఉండనుంది. చాలా రోజులుగా పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
అయితే మూలాల ప్రకారం.. దాదాపు 25% షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉందని అంటున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తీ చేయాలని.. ప్రమోషన్స్ ను భారీగా చేయాలని ప్రణాళికలు రచించారు. గడువులోగా సినిమాను పూర్తి చేసేందుకు మూడు యూనిట్లు పనిచేస్తున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌తో టీమ్ ఇప్పటికే దూకుడుగా ప్రమోషన్స్ ప్రారంభించింది. తొలి లిరికల్ సాంగ్‌కి సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ పాటకు “పుష్ప పుష్ప” అని పేరు పెట్టారు. ఈ పూర్తి లిరికల్ సాంగ్ మే 1న విడుదల కానుంది. పుష్ప 2: రూల్ ఇప్పటికే 1000 కోట్ల భారీ బిజినెస్ చేసింది. ఇండియన్ సినిమాలో ఇదో రికార్డుగా నిలిచింది. ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండనున్నాయని అంచనా వేస్తున్నారు. హిందీ మార్కెట్ లో కూడా సినిమాలను పెద్దగా జనం పట్టించుకోకపోతూ ఉండడంతో అక్కడ కూడా పుష్ప మేనియా మొదలు కాబోతోంది.