పుష్ప-2 సినిమా నుంచి వీడియో లీక్..నెట్టింట వైరల్‌

పుష్ప-2 సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో లీక్‌ అయ్యింది. ఇప్పుడా వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  17 Jun 2023 11:17 AM IST
Pushpa-2, Movie, Allu Arjun, video Leak, Movie Shooting

పుష్ప-2 సినిమా నుంచి వీడియో లీక్..నెట్టింట వైరల్‌

పుష్ప-2 సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో లీక్‌ అయ్యింది. ఇప్పుడా వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన చిత్రం పుష్ప పెద్ద హిట్‌ కొట్టింది. ఇప్పుడు దాని సీక్వెల్‌ పుష్ప-2 షూటింగ్‌ జరుగుతోంది. దీనిపైనా భారీ అంచనాలే ఉన్నాయి. రెండో పార్ట్ ది రూల్‌ కోసం అందరూ ఎంతో వెయిట్‌ చేస్తున్నారు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. కాగా.. పుష్ప-2 సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోన్న సమయంలో.. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో లీకైంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట లీకైంది. ఇప్పడది వైరల్‌గా మారింది. ఎర్రచందనం దుంగలు ఉన్న లారీలు నదిలో వేగంగా వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ లారీలను వెంబడిస్తూ జీపులు వెనకాలే వస్తున్నాయి. ఈ సీన్‌ను చూస్తుంటే సినిమాలో పెద్ద చేజింగ్‌ సీన్‌లా అనిపిస్తోంది. ఇది మూవీలో కీలకమైన సీన్‌గా పలువురు అభిప్రాయపడుతున్నారు. నదిలో ఎర్రచందనం దుంగలతో లారీలు వేగంగా వెళ్తుంటే.. జీపులతో చేజింగ్‌ ఆసక్తికరంగా కనిపిస్తోంది.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్‌ స్టైల్‌.. ఆయన మ్యానరిజానికి ప్రపంచమంతా ఫిదా అయిన తెలిసిందే. ఇప్పుడు రెండో పార్ట్‌లో ఆయన క్యారెక్టర్‌ మరింత పవర్‌ ఫుల్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో పుష్ప-2 మూవీని మైత్రిమూవీ మేకర్స్‌ ప్రొడక్షన్‌ హౌజ్ నిర్మిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తుండగా.. వచ్చే ఏడాది సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story