'పుష్ప-2' రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన మూవీ మేకర్స్

'పుష్ప-ది రూల్‌' సినిమా గురించి బిగ్‌ అప్‌డేట్‌ ప్రకటించింది చిత్ర బృందం.

By Srikanth Gundamalla  Published on  11 Sept 2023 4:37 PM IST
Pushpa-2, Movie, Allu Arjun, Sukumar, Release Date,

'పుష్ప-2' రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన మూవీ మేకర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-ది రైజ్‌' సినిమా పెద్ద హిట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు అల్లు అర్జున్ యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప-ది రూల్' తెరకెక్కుతోంది. షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో మూవీ టీమ్‌ కీలక అప్‌డేట్‌ ప్రకటించింది. పుష్ప-2 రిలీజ్‌ ఎప్పుడనేది తెలిపింది. చిత్ర బృందం ప్రకటనతో బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

‘పుష్ప ది రైజ్‌’ 2021లో విడుదలైంది. హీరోగా అల్లు అర్జున్ కనిపించగా.. సుకుమార్‌ దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా రష్మిక కనిపించారు. ప్రతినాయకుడి పాత్రలో ఫహద్ ఫాజిల్ నటించారు. పార్ట్‌ 1కు విశేష ఆదరణ లభించింది. దాంతో.. పార్ట్‌-2ని మరింత గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం పుష్ప-ది రూల్‌ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసింది. అయితే.. పుష్ప-ది రూల్‌ను వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. బాక్సాఫీసు ఏలడానికి పుష్పరాజ్ మరోసారి వస్తున్నాడంటూ మైత్రీ మూవీ మేకర్స్ తన పోస్టులో పేర్కొంది. రక్తం అంటిన పుష్పరాజ్ చేతిని కూడా పోస్టు చేసింది. ఈ అప్‌డేట్‌ చూసిన అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి కలెక్షన్ల సునామీ రావడం పక్కా అంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో.. బన్నీ స్మగ్లర్‌ పుష్పరాజ్ పాత్ర పోషించారు. సాధారణ కూలీ నుంచి స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనే దానిని పార్ట్‌ -1లో చూపించారు. మంగళం శ్రీను, కొండా రెడ్డి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌కు విరోధం ఎలా ఏర్పడిందనే దాన్ని పార్ట్‌ వన్‌లో చూపించారు.

Next Story