ఇక శ్రీవల్లి వంతు.. 'పుష్ప-2' నుంచి మరో లిరికల్ సాంగ్ అప్‌డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప-ది రూల్.
By Srikanth Gundamalla Published on 23 May 2024 7:30 PM ISTఇక శ్రీవల్లి వంతు.. 'పుష్ప-2' నుంచి మరో లిరికల్ సాంగ్ అప్‌డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప-2. ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ సెన్సేషనల్ అవుతూనే ఉంది. ఇటీవల పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ వచ్చిన తొలి లిరికల్ సాంగ్ శ్రోతలను అలరించింది. యూట్యూబ్ వ్యూస్‌లో ఆల్‌టైమ్ రికార్డులను నెలకొల్పుతోంది. ప్రస్తుతం ఈ సాంగ్ ఇంకా ట్రెండింగ్‌లో ఉండగా.. తాజాగా మరో లిరికల్ సాంగ్‌పై మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు.
పుష్ప-ది రూల్ మూవీలో ఇప్పుడు శ్రీవల్లి వంతు వచ్చింది. పుష్పరాజ్‌తో శ్రీవల్లి ఆడిపాడుకున్న మెలోడీ సాంగ్‌ను కపుల్ సాంగ్‌గా విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ నెల 29వ తేదీన ఉదయం 11.07 గంటలకు ఈ లిరికల్ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సాంగ్‌కు సంబంధించి ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రోమోలో కేశ వాయిస్‌తో సెకండ్ సాంగ్ గురించి రష్మికను అడుగుతారు. మేకప్ వేసుకునేందుకు సిద్ధంగా ఉన్న శ్రీవల్లి.. సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ వుంటాడే నా సామి అంటూ పాడుతుంది. ఐకానిక్ స్టెప్స్‌తో కట్టిపడేసింది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. పుష్పరాజ్ అభిమానులు అదిరిపోయేలా ఈ మెలోడీ సాంగ్ ఉండబోతుందని అంటున్నారు.
పుష్ప-ది రూల్ సినిమాలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ సహా పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ చేస్తుండగా.. మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాగా పుష్ప- దిరూల్ మూవీని ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఈ మూవీకి ముందు వచ్చిన పుష్ప-ది రైజ్ పార్ట్-1 పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు పార్ట్-2 పైనా భారీ అంచనాలు ఉన్నాయి.