'ప్రాజెక్ట్‌-K' కామిక్​ బుక్​ వెర్షన్‌.. కథ ఇదేనంటూ జోరుగా చర్చ

'ప్రాజెక్​ కె' టీమ్​.. తమ సినిమాను కామిక్​ బుక్​ వెర్షన్​లో విడుదల చేయనుందని తెలిసింది.

By Srikanth Gundamalla  Published on  20 July 2023 10:15 AM
Project-K, Comic Book Version, Photos, Viral,

'ప్రాజెక్ట్‌-K' కామిక్​ బుక్​ వెర్షన్‌.. కథ ఇదేనంటూ జోరుగా చర్చ

రెబల్‌ స్టార్ ప్రభాస్‌ తర్వాత రాబోతున్న భారీ బడ్జెట్‌ సినిమా 'ప్రాజెక్ట్ కె'. ఈ చిత్రాన్ని ఇండియాలోనే హైబడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సైన్స్‌ఫిక్షన్‌గా వస్తోన్న 'ప్రాజెక్ట్ కె' సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పటికే విడుదలైన దీపికా పదుకొణె, ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు జనాల్లో మరింత హైప్‌ పెంచేశాయి. మార్వెల్‌ హీరోలా ప్రభాస్, హాలీవుడ్‌ హీరోయిన్‌లా దీపికా లుక్స్‌ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను.. అమెరికా శాన్‌ డిగోలోని ప్రతిష్టాత్మక కామిక్‌ కాన్‌లో ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే దీని కోసం ప్రభాస్‌, కమల్‌హాస్‌, చిత్ర నిర్మాత అశ్వినీ దత్‌ సహా పలువురు అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా నుంచి ప్రతి అప్‌డేట్‌ వైరల్‌ అవుతోంది. ఎందుకంటే సినిమాను హాలీవుడ్‌ లెవెల్‌లో తీస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇక తాజాగా కామిక్‌ కాన్‌ ఈవెంట్‌ సందడి మొదలైపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా అక్కడికి చేరుకున్నారు. సినీ లవర్స్, కామిక్‌ బుక్స్‌ అభిమానులు ఈవెంట్‌కు చేరుకుని ఆస్వాదిస్తారు. 'ప్రాజెక్ట్ కె' మూవీ టీమ్‌ కూడా తమ రైడర్స్‌తో ప్రమోషన్స్‌ జోరుగా చేస్తోంది.

ఇక ఈ ఈవెంట్‌లో ప్రభాస్, కమల్‌హాసన్‌ గ్రాండ్‌ ఎంట్రీ కూడా అదిరిపోయింది. వీటన్నింటికీ సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థ తన అధికారిక సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూనే ఉంది. అభిమానుల్లో ఫుల్‌ జోష్ నింపుతోంది. దీంతో.. సోషల్‌ మీడియాలో పూర్తి 'ప్రాజెక్ట్ కె'పై చర్చే జరుగుతోంది. ఫొటోలు.. పోస్టర్లు.. మూవీకి సంబంధించిన వార్తలపైనే చర్చ ఉంటోంది.

అయితే ఇప్పుడు కామిక్ కాన్ ఈవెంట్​ లో 'ప్రాజెక్​ కె' టీమ్​.. తమ సినిమాను కామిక్​ బుక్​ వెర్షన్​లో విడుదల చేయనుందని తెలిసింది. ఈ బుక్ ​లోని రెండు పేజీలు సోషల్​ మీడియాలో లీక్​ అయిపోయాయి. ఇప్పుడు వాటినే నిర్మాణ సంస్థ వైజయంతీ కూడా పోస్ట్ చేసింది. ప్రాజెక్ట్ కె కామిక్ ఆర్ట్​ వెర్షన్​ అంటూ రాసుకొచ్చింది. ఇక వీటిని చూసిన వారు సినిమా కథ ఇదే అంటున్నారు. కలియుగం చివర్లో ప్రజలను ఇబ్బంది పెట్టే రాక్షకుడు ఉంటాడని, అతడిని సంహరించేందుకు దేవుడిలా ప్రభాస్ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. విలన్‌​గా కమల్ హాసన్ కనిపిస్తారని అభిప్రాయపడుతున్నారు. దీన్ని హాలీవుడ్​ స్టైల్ ​లో దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్​ తో వైజయంతీ మూవీస్​ నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ సహా పలువురు స్టార్లు కనిపించనున్నారు.

Next Story