జానీ మాస్టర్ వివాదంపై స్పందించిన పుష్ప మూవీ నిర్మాత
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైగింక వేధింపులకు సంబంధించిన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
By Srikanth Gundamalla Published on 23 Sept 2024 4:29 PM ISTకొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైగింక వేధింపులకు సంబంధించిన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఆయన అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా.. పోలీసులు కోర్టులో హాజరుపర్చగా జ్యుడిషియల్ రిమాండ్ కూడా న్యాయస్థానం విధించింది. తాజాగా ఇదే అంశంపై పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు. మత్తు వదలరా-2 నిర్మాతగా ఉన్న ఆయన.. ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు జానీ మాస్టర్ అంశం గురించి ప్రశ్నలు అడగ్గా ఆయన సమాధానాలు ఇచ్చారు.
జానీమాస్టర్ వ్యవహారంలో అల్లు అర్జున్, సుకుమార్ పేర్లూ వినిపిస్తున్నాయనీ.. క్లారిటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించగా.. సెన్సేషన్ కావడం కోసం కొన్ని యూట్యూబ్ చానెళ్లు ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని రవిశంకర్ అన్నారు. ఇప్పటి వరకు అందించిన సమాచారం ప్రకారం.. అది వారి వ్యక్తిగత విషయం అని అర్థం అవుతోందని చెప్పారు. ‘పుష్ప 2’ మొదలైనప్పుడే అడిషనల్ కొరియోగ్రాఫర్‌గా ఆమెను తీసుకున్నామనీ రవిశంకర్ అన్నారు. సినిమాలోని అన్ని పాటలకు ఆమె వర్క్ చేస్తారు.. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయని అన్నారు. అక్టోబర్ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు రవిశంకర్. జానీ మాస్టర్‌తో వర్క్ చేయాలనుకున్నాం.. కానీ ఇంతలో ఇది జరిగిందని అన్నారు. ఇక వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా అది వారి వ్యక్తిగతం.. దానిపై మనం కామెంట్ చేయకూడదని నిర్మాత రవిశంకర్ అన్నారు.