కొత్త ప్రయాణం మొదలు..లక్ష్యం నెరవేరే వరకూ తగ్గను: నటి ప్రగతి

జిమ్‌‌ లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ .. తాజాగా మరో కొత్త జర్నీ మొదలుపెట్టారు ప్రగతి.

By News Meter Telugu
Published on : 18 July 2023 5:07 PM IST

Pragathi, Instagram Post, New Journey

కొత్త ప్రయాణం మొదలు..లక్ష్యం నెరవేరే వరకూ తగ్గను: నటి ప్రగతి

నటి ప్రగతి.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు సినిమాలు చేస్తూ, ఇటు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఎప్పటికప్పుడు తన గురించి నలుగురు మాట్లాడుకునేలా చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా వరకూ తాను చేసే కఠిన వర్కౌట్స్ గురించి ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ కు చెబుతూ ఉంటారు. జిమ్‌‌ లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఆమె అప్లోడ్ చేసిన వీడియోలకు మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. తాజాగా మరో కొత్త జర్నీ మొదలుపెట్టారు ప్రగతి. ఫిట్‌నెస్ కోసం వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్న ఆమె ఏకంగా ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్‌గా మారిపోయినట్లు పోస్ట్ పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

"కొత్త ప్రయాణం మొదలైంది. 2 నెలల క్రితం నా జీవితం ఇంతలా మలుపు తిరుగుతుందని నేను అసలు ఊహించలేదు. పవర్ లిఫ్టింగ్‌లో నా కొత్త జర్నీ ఇది. రెండు నెలల క్రితం మొదలైన ఈ ప్రయాణం ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇది కూడా పూర్తి చేసే తీరతాను. ప్రస్తుతానికి 250 స్కోర్ సాధించాను. కానీ టార్గెట్ చాలా ఎక్కువ ఉంది. లక్ష్యాన్ని చేరేవరకు వెనక్కి తగ్గేదేలేదు" అంటూ పోస్టు పెట్టారు. ఆమె హీరో, హీరోయిన్లకు త‌ల్లి, వ‌దిన‌ పాత్రల్లో మెప్పించారు. కానీ ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ లో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యారు ప్రగతి.

Next Story