'సలార్' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. అధికారిక ప్రకటన చేసిన టీమ్

తాజాగా సలార్‌ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

By Srikanth Gundamalla  Published on  29 Sept 2023 11:24 AM IST
Prabhas, salaar Movie, release date, prashanth neel,

'సలార్' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. అధికారిక ప్రకటన చేసిన టీమ్

రెబల్ స్టార్ ప్రభాస్‌ నుంచి వస్తోన్న పెద్ద సినిమా 'సలార్'. ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాదు.. సినిమా ప్రేక్షకులంతా ఎంతో ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్‌ రెండు భాగాలు ఎంతో పెద్దహిట్‌ను సాధించాయి. దాంతో.. ఆ సినిమాలకు మించి సలార్ ఉంటుందని భావిస్తున్నారు సినిమా ప్రేక్షకులు. ఎప్పుడు థియేటర్లలో రిలీజ్‌ అవుతుందా అని అనుకుంటున్నారు. తాజాగా సలార్‌ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.

'సలార్' సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది చిత్ర బృందం. డిసెంబర్ 22న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. దాంతో.. ప్రభాస్‌ అభిమానులు ఎంతో సంబరపడిపెఓతున్నారు. మరోవైపు ఈ సినిమా విడుదల డేట్ రావడంతో హ్యాట్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఎక్స్ (ట్విట్టర్‌)లో #SalaarCeaseFire హవానే కనిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 22 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేసారు. చేతిలో కత్తితో, రక్తం తో ఉన్న ప్రభాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ తో పాటుగా, పోస్టర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై సలార్‌ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా.. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీనే విడుదల చేయాలని భావించారు. కొన్ని కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోసారి డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు సలార్‌ రానుందని తెలిసి అభిమానులంతా ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ విశేషంగా అలరించింది. ఈ సినిమాపై అంచనాలు పెంచింది. హీరోను ఎలివేట్‌ చేస్తూ ప్రముఖ నటుడు టీనూ ఆనంద్‌ చెప్పిన ‘సింపుల్‌ ఇంగ్లిష్‌’ డైలాగ్స్‌, యాక్షన్‌ విజువల్స్‌ ప్రేక్షకులతో అదరహో అనిపించాయి.

Next Story