ఓటీటీలోకి వచ్చేస్తున్న సలార్.. స్ట్రీమింగ్‌ తేదీ అదేనా?

తాజాగా ప్రభాస్‌ సలార్‌ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  16 Jan 2024 12:30 PM GMT
prabhas, salaar movie, ott , netflix,

ఓటీటీలోకి వచ్చేస్తున్న సలార్.. స్ట్రీమింగ్‌ తేదీ అదేనా?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంక్రాంతి సందడి కొనసాగుతోంది. ఈ పండగ సందర్భంగా థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. అయితే.. పెద్ద సినిమాల కంటే హనుమాన్‌ సినిమా మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక మహేశ్‌బాబు గుంటూరుకారం, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నాసామిరంగ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక డిసెంబర్‌ చివర్లో వచ్చిన ప్రభాస్‌ మూవీ సలార్‌ కూడా అక్కడక్కడ ప్రదర్శితం అవుతూనే ఉంది. అయితే.. తాజాగా ప్రభాస్‌ సలార్‌ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బాహుబలి తర్వాత ప్రభాస్‌ సినిమాలు చేస్తున్నాడు కానీ.. అంతస్థాయిలో హిట్‌ను అందుకోలేకపోయాడు. దాంతో.. అందరూ సలార్‌పై అంచనాలు పెట్టుకున్నారు. యాక్షన్‌ సీన్లు సూపర్‌గా అనిపించాయి. అయితే.. మొదట కాస్త తడబడ్డా.. ఓవరాల్‌గా హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. వరల్డ్‌ వైడ్‌గా రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్‌ రన్‌ పూర్తయ్యేటప్పటికి రూ.800 కోట్ల మార్క్‌ దాటొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇకపోతే.. సలార్‌ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూసేద్దామా అనుకుంటున్నారు. కాగా.. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా.. ఓటీటీ రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో వచ్చిన 45 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని అగ్రిమెంట్‌ చేసుకున్నారు. దీనిక ప్రకారం.. ఫిబ్రవరి 4న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. ఒకవేళ ఈ తేదీ కుదరకపోతే ఫిబ్రవరి 9వ తేదీన ఓటీటీలో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవారం తర్వాత సలార్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై పూర్తి క్లారిటీ రానుంది.

Next Story