సలార్‌ ఫస్ట్‌ షో టికెట్‌ కావాలా..? హీరో నిఖిల్ ఫ్రీ ఆఫర్

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ తాజాగా నటించిన చిత్రం 'సలార్‌ పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌' విడుదలకు సిద్ధం అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  16 Dec 2023 5:53 PM IST
prabhas, salaar movie,  nikhil, free tickets,

సలార్‌ ఫస్ట్‌ షో టికెట్‌ కావాలా..? హీరో నిఖిల్ ఫ్రీ ఆఫర్

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ తాజాగా నటించిన చిత్రం 'సలార్‌ పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌' విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మూవీకి క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ కోసం సినిమా ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇద్దరు స్నేహితుల మధ్య కథ నేపథ్యంలో వస్తోన్న సలార్‌ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.

కాగా.. కర్ణాటకలో ఇప్పటికే సలార్‌ పార్ట్‌-1 అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాలేదు. శనివారం నుంచే జరుగుతాయని చెప్పినా.. ప్రస్తుతానికి ఇంకా మొదలుకాలేదు. ప్రభాస్‌ సలార్‌ సినిమా ఫస్ట్‌ షో చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు బుకింగ్స్ ప్రారంభం అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్‌ దొరకుతుందా లేదా అనే టెన్షన్ కూడా అభిమానుల్లో ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ ఓ శుభవార్త చెప్పాడు.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కోసం హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్లో డిసెంబర్‌ 21న అర్ధరాత్రి ఒంటి గంటకు సలార్‌ షో పడనుంది. ఈ షో కోసం చాలా మంది టికెట్లు కావాలని అడుగుతుంటారు. ఈ క్రమంలోనే ఈ షోకు సంబంధించిన 100 టికెట్లు తాను ఇస్తానని ప్రకటించాడు నిఖిల్. డై హార్డ్‌ ఫ్యాన్స్‌కు ఫ్రీగా టికెట్స్‌ ఇస్తాననీ.. వారితో కలిసి సినిమా చూస్తానని హీరో నిఖిల్‌ సోషల్ మీడియాలో ప్రకటించాడు. పదేళ్ల క్రితం ఇదే థియేటర్లో మిర్చి సినిమా చూసినట్లు చెప్పాడు. ఇప్పుడు సలార్‌ సినిమాను కూడా అదే షో చూడటం ద్వారా హిస్టరీ రిపీట్‌ అవుతుందని పేర్కొన్నాడు హీరో నిఖిల్‌. ఈ పోస్టు చూసిన ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఖుషీ అవుతున్నారు. అయితే.. టికెట్లు నిఖిల్ ఎలా ఇస్తాడనేది మాత్రం క్లారిటీగా చెప్పలేదు. దాంతో.. ప్రభాస్‌ అభిమానులు నిఖిల్‌ను ట్యాగ్ చేస్తూ మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పెడుతున్నారు. అన్నా ఒక్క టికెట్‌.. రెండు టికెట్లు ఇవ్వండి ప్లీజ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


Next Story