#SalaarGoesGlobal: ఓటీటీలో సలార్‌కు హాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా

రెబల్‌ స్టార్ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన సలార్‌ సినిమా భారీ హిట్‌గా నిలిచింది.

By Srikanth Gundamalla  Published on  27 Jan 2024 10:51 AM IST
prabhas, salaar movie,  global,  netflix,

 #SalaarGoesGlobal: ఓటీటీలో చూసి సలార్‌కు హాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా

రెబల్‌ స్టార్ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన సలార్‌ సినిమా భారీ హిట్‌గా నిలిచింది. కొంత కాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తోన్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగవాతావరణాన్ని ఇచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే.. వెయ్యి కోట్ల వరకు కలెక్షన్లు వచ్చేవి కానీ బాలీవుడ్‌లో అంతగా ప్రమోషన్స్‌ చేయకపోవడంతో తగ్గాయని అంటున్నారు. అంతేకాదు.. సలార్‌ విడుదల సమయంలో షారుఖ్‌ డంకీ సినిమా విడులైంది. దాంతో..ఆ సినిమాకు ఎక్కువ బుకింగ్స్‌ జరగడం ఓ కారణమని అంటున్నారు.

ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో సలార్‌ సినిమాను విడుదల చేసిన విషయం తెలిసిందే. థియేటర్లలో చూడలేకపోయిన వారంతా ఇప్పుడు సలార్‌ను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్‌ యాక్షన్‌ సీన్లు.. ఆయన కటౌట్‌ చూసి ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు నార్త్‌లో టా-1లో సలార్‌ సినిమా దూసకుపోతుంది. టాలీవుడ్‌ నుంచి మొదలైన ప్రభాస్ దండయాత్ర పాన్‌ ఇండియా దాటి ఇప్పుడు హాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. జనవరి 20 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. ఈ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సబ్‌స్క్రైబర్లు మన దేశంలో కన్నా విదేశాల్లోనే ఎక్కువగా ఉంటారు. దాంతో.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సలార్‌ మూవీని చూసిన హాలీవుడ్‌ సినిమా ప్రేక్షకులు ప్రభాస్‌ కటౌట్‌కు ఫ్యాన్స్‌ అయిపోతున్నారు.

నెట్‌ఫ్లిక్‌ కారణంగా ప్రస్తుతం సలార్‌ గ్లోబల్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం #SalaarGoesGlobal హ్యాష్‌ ట్యాగ్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. సలార్‌ సినిమాను చూసిన విదేశాల్లోని మూవీ ప్రేక్షకులు సూపర్బ్‌గా ఉందంటూ కామెంట్లు చేయడం విశేషంగా మారింది. ప్రస్తుతం తెలుగు,తమిళ్‌,కన్నడ,మళయాలం, హిందీ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఫారిన్ ఆడియెన్స్ నుంచి ఊహించని రేంజ్‌లో క్రేజ్ దక్కుతోంది. వారందరూ ఎక్స్‌ పేజీ ద్వారా సలార్‌పై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఇంగ్లీష్‌లో అందుబాటులో లేకుండానే ఈ రేంజ్‌లో ఆదరణ లభిస్తే.. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌లో సినిమా విడుదల అయ్యి ఉంటే మరో లెవల్‌లో ఉండేదని ప్రభాస్‌ ఫ్యాన్స్ అంటున్నారు. ఇంగ్లీష్‌లో వచ్చి ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ప్రభాస్ కనెక్ట్‌ అయ్యేవారని అంటున్నారు.




Next Story