'ప్రాజెక్ట్‌-K' నుంచి అదిరిపోయేలా ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌

'ప్రాజెక్ట్‌ కె' నుంచి ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

By Srikanth Gundamalla  Published on  19 July 2023 5:10 PM IST
Prabhas, Project-K Movie, First Look, Release,

'ప్రాజెక్ట్‌-K' నుంచి అదిరిపోయేలా ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌  

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం 'ప్రాజెక్ట్‌ కె'. ఫ్యూచరిస్టిక్ సైన్స్‌ ఫిక్షన్ మూవీగా రూపుదిద్దుకుంటోంది ప్రాజెక్ట్‌ కె సినిమా. ఇప్పటికే అనేక ఆకర్షణలతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఇండియాలోనే భారీ బడ్జెట్‌ సినిమాగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ప్రభాస్‌ ఫస్ట్‌ లుక్‌ చూసిన తర్వాత అభిమానులంతా యమ ఖుషీ అవుతున్నారు. ఈ సారి ప్రభాస్‌ గట్టిగానే కొడతారంటూ ఆశలు పెట్టుకుంటున్నారు.

'ప్రాజెక్ట్‌ కె' నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌లో దాదాపు ప్రభాస్‌ ఐరన్‌ మ్యాన్‌లా కనిపిస్తున్నారు. దీంతో ఇది అలాంటి ఇలాంటి సినిమా అయితే కాదని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌ హీరోలు ఇలాంటి అవతార్‌లో కనబడింది లేదు. అదీకాక పెద్ద హీరోతో ఇలాంటి మూవీ చేస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే పెట్టుకుంటున్నారు అభిమానులు. ప్రస్తుతం పోస్టర్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

'ప్రాజెక్ట్‌ కె'సినిమాలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి తారలు నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్‌ ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. 'ప్రాజెక్ట్‌ కె' టైటిల్‌ గ్లింప్స్‌ భారత్‌లో జూలై 21న, అమెరికాలో జూలై 20న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తోంది. 'ప్రాజెక్ట్‌ కె' శాన్‌ డియాగో కామిక్‌-కాన్‌ 2023లో లాంచ్‌ అవుతోంది. అక్కడ లాంచ్‌ అవుతోన్న తొలి భారతీయ చింత్రంగా క్రియేట్‌ చేయబోతోంది. ఈ వేడుకకు ప్రభాస్, కమల్‌ హాసన్, దీపికా, నాగ్‌ అశ్విన్, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నట్లు సమాచారం.

ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. 'ప్రాజెక్ట్‌ కె'తో వైజయంతి మూవీస్‌ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ప్రభాస్‌ పోస్టర్‌ చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఉండబోతుంది సినిమా అని అనుకుంటున్నారు అభిమానులు. ఇక డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ కూడా సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రపంచస్థాయి నిర్మాణ ప్రమాణాలతో 'ప్రాజెక్ట్‌ కె'ను రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా నెక్ట్స్‌ లెవల్‌లో ఉండనుందని టాక్‌ నడుస్తోంది. అయితే.. ఈ సినిమాను 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Next Story