ప్రభాస్ 'కల్కి 2898-ఏడీ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898-ఏడీ'.
By Srikanth Gundamalla Published on 5 Jun 2024 1:30 PM ISTప్రభాస్ 'కల్కి 2898-ఏడీ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898-ఏడీ'. ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ విడుదల కాబోతుంది. మహానటి సినిమా దర్వకుడు నాగ్ అశ్విన్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. బారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానులతో పాటు.. సినిమా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకన్నారు. రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది. జూన్ 27న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.
కాగా.. సినిమా విడుదల తేదీ దగ్గరపుడుతున్నా.. ఇప్పటికీ కల్కి నుంచి ట్రైలర్ విడుదల కాలేదు. ఎప్పుడు ట్రైలర్ వస్తుందా అని ప్రభాస్ అబిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్ట్స్.. టీజర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ట్రైలర్ ఎలా ఉంటుందనే అంచనాలు వేస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ట్రైలర్ విడుదలపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. కల్కి సినిమా ట్రైలర్‌ను జూన్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే మరో కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరో లెవల్‌కు వెళ్తాయని.. బ్లాక్ బాస్టర్ కావడం పక్కా అంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.
ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొణె, దిశా పఠాని నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ సంగీతం దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అదే బుజ్జి. ఇప్పటికే బుజ్జి, ప్రభాస్ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది.. వారి సంభాషణకు సంబంధించి రెండు ఎపిసోడ్‌లను విడుదల చేశారు చిత్ర యూనిట్.
𝐀 𝐍𝐄𝐖 𝐖𝐎𝐑𝐋𝐃 𝐀𝐖𝐀𝐈𝐓𝐒!#Kalki2898AD Trailer on June 10th. @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/5FB0Mg6kNi
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 5, 2024