ప్రభాస్, మారుతి సినిమాకి టైటిల్‌ ఒక కారు పేరా..?

ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో హారర్‌ జానర్‌లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  30 Jun 2023 12:46 PM IST
Prabhas, Maruthi, Movie, New Title

ప్రభాస్, మారుతి సినిమాకి టైటిల్‌ ఒక కారు పేరా..?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌ మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకున్నా వసూళ్లు బాగానే రాబడుతోంది. ప్రభాస్‌ లైనప్‌లో ఉన్న సినిమాల గురించి తరచూ ఏదో ఒక అప్‌డేట్‌ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా వినిపిస్తూనే ఉంటుంది. ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో హారర్‌ జానర్‌లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. తాజాగా వీరిద్దరి సినిమా టైటిల్‌కు సంబంధించిన వార్తే నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ప్రభాస్‌ సినిమా నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ ఏమీ లేవు. దీంతో.. షూటింగ్ జరగడం లేదని అభిమానులు భావిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండా సైలెంట్‌గా పూర్తి చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ప్రభాస్‌ టాకీ పార్ట్‌ చాలా వరకు పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమాకు మాత్రం టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. గతంలో 'రాజా డీలక్స్‌' అని ప్రచారం జరిగింది. కానీ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ కాలేదు. మరోసారి టైటిల్‌పై ప్రచారం జరుగుతోంది. సినిమాకు రాజాడీలక్స్‌ కాదు.. ఓ కారు పేరుని వాడుతున్నట్లు తెలుస్తోంది. అంబాసిడర్‌ కార్ల గురించి అందరికీ తెలిసిందే. కొంతకాలం ముందే ఈ కార్లు ఎంతో ఫేమస్‌. ఆ కారు పేరునే ప్రభాస్‌, మారుతి సినిమాకు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రొడ్యూసర్లు కూడా ఈ టైటిల్‌ రిజిస్టర్‌ చేయించినట్లు టాక్‌ నడుస్తోంది. భారీ బడ్జెట్‌ యాక్షన్ సినిమాలతో కనిపించిన ప్రభాస్‌ లుక్‌, సినిమా కథ ఈసారి రిఫ్రెషింగ్‌గా ఉంటుందని భావిస్తున్నారు అభిమానులు. అంబాసిడర్‌ పేరుని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Next Story