మారుతి డైరెక్షన్‌లో 'వింటేజ్ కింగ్‌'గా రాబోతున్న ప్రభాస్

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌, మారుతీ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  7 Aug 2023 2:01 PM
Prabhas, Maruthi, Movie, Vintage king, Horror Comedy,

 మారుతి డైరెక్షన్‌లో 'వింటేజ్ కింగ్‌'గా రాబోతున్న ప్రభాస్ 

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ ఆదిపురుష్‌ ఫ్లాప్‌ తర్వాత తర్వాతి సినిమాలపై ఫోకస్ పెట్టారు. సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. అయితే.. ప్రస్తుతం యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ఎక్కువగా మారుతీ డైరెక్షన్‌లో వస్తోన్న సినిమాపై పెట్టినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా యాక్షన్‌ సినిమాల్లోనే కనిపిస్తున్న ప్రభాస్‌.. ఈ సారి భిన్నంగా హారర్‌ కామెడీ కథలో కనిపిస్తారు. ఇక మారుతీ కామెడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఆయన తీసిన కామెడీ, హార్రర్ చిత్రాలు గొప్పవిజయాన్ని సాధించాయి. ఇప్పుడు ప్రభాస్‌తో తీస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.

అయితే.. మారుతీ, ప్రభాస్‌ సినిమాకు ఇప్పటి వరకు అధికారికంగా టైటిల్‌ ఖరారు కాలేదు. చాలా పేర్లు కూడా వినిపించాయి. ఇటీవల రాజా డీలక్స్‌ అని ఇంకా వేరేవేరే పేర్లు చక్కర్లు కొట్టాయి. అయితే.. మరోసారి హార్రర్ కామెడీ సినిమాకు సంబంధించి ఓ టైటిల్ ఖరారైందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ 'వింటేజ్‌ కింగ్‌'గా వస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఈ సినిమాలో ప్రభాస్‌ లుంగీ కట్టుకుని కనిపిస్తారట. గతంలో ఈశ్వర్, చత్రపతి, మిర్చి సినిమాల్లో ప్రభాస్ లుంగీ కట్టుకుని కనిపించారు. ఈ సినిమాలు ఇండస్ట్రీలో హిట్‌గా నిలిచాయి. దాంతో.. మరోసారి ఆయన సెంటిమెంట్‌ కూడా వర్కవుట్‌ కావొచ్చనే అంచనాలు ఉన్నాయి.

'వింటేజ్‌ కింగ్‌' సినిమాతో ప్రభాస్‌ తొలిసారిగా హారర్ జోనర్‌లోకి అడుగుపెడుతున్నారు. ప్రేక్షకులు యంగ్ రెబల్‌ స్టార్‌లో కొత్త యాంగిల్‌ చూస్తారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు చిత్ర యూనిట్. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా.. ఆదిపురుష్‌ తెలుగు హక్కులను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది. భారీగా డబ్బులు పెట్టినా.. ఆదిపురుష్‌ అంతగా మెప్పించలేకపోవడంతో ఈ నిర్మాణ సంస్థ లాస్‌ అయ్యిందని వార్తలు వచ్చాయి. దాంతో.. ప్రభాస్‌ కూడా తగిన న్యాయం చేసేందుకు 'వింటేజ్‌ కింగ్‌' మూవీని త్వరగా పూర్తి చేసేందుకు మొగ్గు చూపుతున్నారనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

బిగ్‌ స్క్రీన్‌పై ప్రభాస్‌ వింటేజ్ లుక్‌ అనగానే డార్లింగ్‌ అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందా అనుకుంటున్నారు. హారర్‌ కామెడీ చిత్రాలను డైరెక్షన్‌ చేయడంలో మారుతీకి పెట్టిన విద్య. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే మారుతీ పేరు కూడా పాన్‌ ఇండియా లెవల్‌లో మార్మోగనుంది. 'వింటేజ్‌ కింగ్‌' సినిమాలో సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌లు నటిస్తున్నారు.

Next Story