ప్రభాస్ తో తలపడనున్న కమల్ హాసన్; పారితోషకం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Prabhas makes official announcement of working with Kamal Haasan in Project K. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అశ్విని దత్ నిర్మిస్తున్నారు.
By Bhavana Sharma Published on 25 Jun 2023 4:24 PM ISTనాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్టు కే అనే సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభాస్, దీపిక పదుకొనే హీరో హీరోయిన్లుగా నటించగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలోకి ఇప్పుడు మరొక అద్భుతమైన నటుడు రావడం జరిగింది.
గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో దర్శక నిర్మాతలు ఈ వార్తను కొట్టి పారేసినప్పటికీ కూడా ఈరోజు మొత్తానికి అధికారికంగా కమల్ హాసన్ సినిమాలో ఉన్నట్టు తెలియజేశారు. ఈ ప్రకటనతో ప్రేక్షకుల ఆనందానికి హద్దులు లేవు. దాదాపు నెల రోజులు ఈ సినిమాకు షూటింగ్ చేయబోతున్నారట కమల్. ఆయన ఈ సినిమాలో ఉండటం వల్ల తమిళనాడులో బాక్సాఫీసు వద్ద సినిమాకు ఎదురు ఉండదు కాబట్టి దాదాపు 100 కోట్ల రూపాయలను రెమినరేషన్ గా అడిగారట. అయితే కొంతమంది మాత్రం అది అబద్ధమని చెబుతూ ఆయన పారితోషకం కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే అంటున్నారు.
దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తొలకెక్కుతున్న ఈ చిత్రం అనుకున్నవన్నీ సరిగ్గా జరిగితే మాత్రం సంక్రాంతికి థియేటర్స్ లో విడుదల చేస్తామని కొద్దిరోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. కానీ మధ్యలో అమితాబచ్చన్ కు జరిగిన చిన్న యాక్సిడెంట్ వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే షూటింగ్ మళ్లీ ఇప్పుడు మొదలైనప్పటికీ సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అనే విషయంపై ప్రేక్షకుల్లో అనుమానాలు ఉన్నాయి.
ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, “నా మనసులోఎప్పటికీ నిలిచిపోయే క్షణం. #ప్రాజెక్ట్ కె లో లెజండరీ కమల్ హసన్ సర్ తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఇంత గొప్ప వ్యక్తి తో కలిసి పనిచేయడం, నేర్చుకునే అవకాశం రావడం కల నెరవేరిన క్షణం’ అన్నారు.
కమల్ హాసన్ ఈ చిత్రంలో చేరడం గురించి నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ.. “నా కెరీర్‌లో మిస్టర్ కమల్ హాసన్ తో కలిసి పనిచేయడం ఎప్పటినుంచో ఉన్న కల. ‘ప్రాజెక్ట్ కె’తో ఇప్పుడు కల సాకారమైంది. మిస్టర్ కమల్ హాసన్, మిస్టర్ అమితాబ్ బచ్చన్ .. ఇద్దరు దిగ్గజ నటులతో కలిసి పని చేయడం ఏ నిర్మాతకైనా గొప్ప క్షణం. నా కెరీర్‌లో 50వ సంవత్సరంలో ఈ అవకాశం రావడం ఇది నిజంగా నాకు వరం’’ అని అన్నారు.