ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ తాజాగా నటిస్తున్న సినిమా 'కల్కి 2898 ఏడీ' ఒకటి.

By Srikanth Gundamalla  Published on  26 May 2024 11:44 AM IST
prabhas, kalki movie, trailer,

ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే.. 

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ తాజాగా నటిస్తున్న సినిమా 'కల్కి 2898 ఏడీ' ఒకటి. ఈ మూవీకి మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్‌ దత్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీపికా పదుకొనే, దిశా పటానీలు హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. కాగా.. ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇంతపెద్ద స్టార్లు ఒకే మూవీలో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇక ఇటీవల ఈ మూవీ నుంచి బుజ్జి అనే కొత్త క్యారెక్టర్‌ను విడుదల చేశారు. దీని కోసం స్పెషల్ ప్రోమోను రెడీ చేశారు. బుజ్జి అంటే వ్యక్తి కాదు ప్రభాస్‌కు వాహనం. వెహికల్‌కే ఇంత ప్రాధాన్యత ఇస్తుండటంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. బుజ్జిని పరిచయం చేసేందుకు ఇటీవల రామోజీఫిలిం సిటీలో ఓ వేడుకను నిర్వహించారు. ఇది పెద్ద హిట్‌గా అయ్యింది. కాగా.. ప్రభాస్ కల్కి మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ రోజులు లేకపోవడంతో ప్రమోషన్స్‌ను నిర్వహిస్తున్నారు.

మరోవైపు కల్కి సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుంది. కానీ ఇప్పటి వరకు ట్రైలర్ మాత్రం విడుదల కాలేదు. దాంతో.. ట్రైలర్‌ గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ప్రోమోలే ఈ రేంజ్‌లో ఉంటే.. ట్రైలర్‌ ఎలా ఉంటుందో అని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కల్కి మూవీ ట్రైలర్‌కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. కల్కి మూవీ ట్రైలర్‌ను జూన్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గ్రాండ్‌గా రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్లాన్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ట్రైలర్ విడుదల, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.

Next Story