ఓటీటీలోకి రాబోతున్న కల్కి మూవీ.. రిలీజ్ డేట్ ఇదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 1:30 PM ISTఓటీటీలోకి రాబోతున్న కల్కి మూవీ.. రిలీజ్ డేట్ ఇదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 27న థియేటర్లలో విడుదల బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టింది. ఈ మూవీలో గ్రేట్ లెజెండ్స్ అమితాబ్, కమల్‌హాసన్ నటించడంతో మరింత హైప్ పెరిగింది. హీరోయిన్‌గా దీపిక పదుకొణె నటించింది. 39 ఏళ్ల తర్వాత అమితాబ్, కమల్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ మూవీకి విలువ పెరిగి.. ప్రేకులను ఆకట్టుకుంది.
థియేటర్లలో ఎంతో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు సినిమా ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో సినీ ప్రియుల్లో జోష్ నింపే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కల్కి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని సమాచారం. ఈ మూవీని ఈ నెల 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. కల్కి హిందీ వెర్షన్ అదే తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో కల్కి 2898 ఏడీ సినిమా తెరెక్కింది. ఈ మూవీలో మృణాల్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజేంద్రప్రసాద్, పశుపతి కూడా కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను సృష్టించింది.