Bhairava Anthem: భైరవ సాంగ్ ప్రోమో వచ్చేసింది
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD.
By Srikanth Gundamalla Published on 15 Jun 2024 8:15 PM IST
Bhairava Anthem: భైరవ సాంగ్ ప్రోమో వచ్చేసింది
భైరవ సాంగ్ ప్రోమో: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే ట్రైలర్ మంచి కిక్ ను ఇవ్వగా.. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ విదేశాల్లో అదరగొడుతూ ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ లో.. భైరవ ఆన్థమ్(Bhairava Anthem) కు సంబంధించిన మొదటి పాట ప్రోమో శనివారం విడుదలైంది. దిల్జిత్ దోసాంజ్ స్వరాలతో, చిత్ర బృందం దీనిని 'భారతదేశంలో అతిపెద్ద పాట' (‘India’s biggest song’) అని చెబుతోంది.
కల్కి 2898 AD విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చిత్ర బృందం ఆదివారం నాడు మొదటి పాటను విడుదల చేయనుంది. దానికంటే ముందు 21 సెకన్ల నిడివి ఉన్న ప్రోమోను విడుదల చేశారు. మొత్తం పాట ఎలా ఉంటుందో అనే ఉత్కంఠను రేకెత్తించబోతోంది ఈ ప్రోమోతో. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. పంజాబీ సాంగ్ లాగా కనిపించే ఈ పాటను దిల్జిత్ పాడాడు.
కల్కి చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పటానీ, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 2898 సంవత్సరంలో కాశీలో వనరులన్నీ కాంప్లెక్స్‌కు పంపగా ప్రజలు జీవించడానికి ఎలా కష్టపడుతున్నారో ఈ సినిమా చూపిస్తుంది. కల్కి అవతారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ బౌంటీ హంటర్‌గా నటిస్తున్నాడు. జూన్ 27న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.