కల్కి సినిమాకు సంబంధించి ఆడియన్స్ డిమాండ్ మామూలుగా లేదుగా!!
కల్కి 2898 AD సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంచనాలను అందుకుంది ఈ సినిమా.
By M.S.R Published on 28 Jun 2024 9:30 AM ISTకల్కి సినిమాకు సంబంధించి ఆడియన్స్ డిమాండ్ మామూలుగా లేదుగా!!
కల్కి 2898 AD సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంచనాలను అందుకుంది ఈ సినిమా. సైన్స్ ఫిక్షన్‌తో పౌరాణికాలను మిళితం చేసి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆహా అనిపించాడు. ఇక మహాభారత ఎపిసోడ్ అభిమానుల నుండి ఊహించని ప్రశంసలు పొందింది.
అశ్వత్థామ, అర్జునుడు, కర్ణుడు, శ్రీకృష్ణుడు వంటి వివిధ పాత్రలు ఈ చిత్రంలో భాగంగా ఉన్నాయి. ఇతర పాత్రలను సినిమాలో స్పష్టంగా చూపించినప్పటికీ, శ్రీకృష్ణుడి పాత్ర సస్పెన్స్‌గా మిగిలిపోయింది. కల్కి 2898 ADలో శ్రీ కృష్ణుడిని సిల్హౌట్ ఫిగర్‌గా చూపించారు. నాగ్ అశ్విన్ శ్రీకృష్ణుని ముఖాన్ని బయటపెట్టకుండా అద్భుతంగా, ప్రత్యేకంగా చూపించాడు. ఇంతకుముందు ఆకాశమే నీ హద్దురా చిత్రంలో సూర్య స్నేహితుడు, పైలట్‌గా నటించిన నటుడు కృష్ణ కుమార్ ఈ పాత్రను కల్కిలో పోషించాడు. అయితే సినిమాలో ఎక్కడా కూడా అతని ముఖం కనిపించలేదు. శరీరం మాత్రమే కనిపిస్తుంది. కృష్ణ కుమార్ తన పాత్రకు విస్తృతమైన ప్రశంసలు అందుకున్నాడు. తెలుగు సినిమాలో ఇంత ముఖ్యమైన పాత్ర పోషించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
అయితే శ్రీకృష్ణుడి పాత్రను సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయించాలనే డిమాండ్ మొదలైంది. సినిమా ప్రేమికులందరి సాధారణ డిమాండ్ ఏమిటంటే, మహేష్ బాబును శ్రీకృష్ణుడిగా చూపించాలని. మహేష్ బాబు అభిమానులే కాకుండా సినిమా లవర్స్ ఈ పాత్రను పోషించడానికి మహేష్ బాబు సరైన ఎంపిక అని అన్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.