ప్రీసేల్స్‌లో ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' మూవీ రికార్డు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తాజాగా నటించిన చిత్రం 'కల్కి 2898 ఏడీ'.

By Srikanth Gundamalla  Published on  18 Jun 2024 1:45 PM IST
Prabhas, kalki 2898 AD, movie, pre-sales, record,

ప్రీసేల్స్‌లో ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' మూవీ రికార్డు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తాజాగా నటించిన చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ మూవీకి నాగ్‌ అశ్విన్ దర్శకత్వం వహించారు. సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తున్న ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. సినిమా విడుదల తేదీ కూడా దగ్గరపడుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌పై ఫోకస్‌ పెట్టాల్సిన టీమ్‌ కాస్త వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. ప్రమోషన్స్‌లో అంత యాక్టివ్‌గా కనిపంచలేదు. గత కొద్ది రోజుల క్రితం బుజ్జి వెహికల్‌తో తప్ప టీమ్‌ పూర్తి స్థాయి ప్రమోషన్స్‌ కనిపించలేదు. అయితే.. అప్‌డేట్స్‌ కూడా సరిగ్గా చేయకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. భైరవ ఆంథమ్‌ అంటూ ఫస్ట్‌ సింగిల్‌పై హంగామా చేసి టైమ్‌కి విడుదల చేయలేదు.. దాంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్కి సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్లు.. ట్రైలర్లు బాగున్నాయి. అంతకుముందు ఓటీటీలో విడుదల చేసిన బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ ఎపిసోడ్స్‌ కూడా ఫరవాలేదనిపించాయి. ఇంటర్వ్యూలు నిర్వహించాల్సిన టీమ్‌ ఇంకా ప్రజల ముందుకు రావడం లేదు. మరి ఇంకెప్పుడు ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తారో. కల్కి సినిమా విడుదల తేదీ మాత్రం జూన్ 27వ తేదీనే.

కల్కి సినిమా ఇప్పుడు ఓ రికార్డును క్రియేట్ చేసింది ప్రీ సేల్స్‌తోనే రెండు మిలియన్ల డాలర్లను నార్త్‌ అమెరికాలో కొల్లగొట్టింది కల్కి. లాంగ్‌ రన్‌లో కనీసం మిలియన్ డాలర్లను కూడా కొల్లగొట్టడానికి కిందా పడుతాయి కొన్ని సినిమాలు.. కానీ కల్కి మాత్రం ప్రీసేల్స్‌ తోనే రెండు మిలియన్లు రాబట్టడంతో అభిమానులు సంతోష పడుతున్నారు. మరి ఓపెనింగ్‌ డే కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో అంటూ ఊహించుకుంటున్నారు. డే వన్ రికార్డులు కచ్చితంగా బ్రేక్‌ అవుతాయని అంటున్నారు. కల్కి 2898 ఏడీకి రూ.200 కోట్ల వరకు ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.

కాగా.. ఈ సినిమలో కమల్‌ హాసన్, అమితాబ్‌ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హీరోయిన్లుగా దీపికా పదుకొణె, దిశా పటానీ నటించారు. భారీ క్యాస్టింగ్‌తో అశ్వనీదత్ ఈ చిత్రాన్ని గ్రాండియర్‌గా నిర్మించాడు. ఐదు వందల కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు.

Next Story