రామ్‌చరణ్‌ మంచి ఫ్రెండ్‌..తనతో కచ్చితంగా సినిమా చేస్తా: ప్రభాస్

ఏదో ఒక రోజు రామ్‌చరణ్‌తో కలిసి కచ్చితంగా సినిమా చేస్తా అని ప్రభాస్‌ తెలిపారు.

By Srikanth Gundamalla  Published on  21 July 2023 12:20 PM IST
Prabhas, Ramcharan, Comic-Con, Kalki 2898 AD

రామ్‌చరణ్‌ మంచి ఫ్రెండ్‌..తనతో కచ్చితంగా సినిమా చేస్తా: ప్రభాస్

రెబస్‌ స్టార్‌ ప్రభాస్‌ సినిమా ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూశారు. అయితే.. తాజాగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌ చూసిన ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమా ఉంటుందని అనుకుంటున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ ఈవెంట్లో (Comic-Con) చిత్రబృందం పాల్గొని సినిమా టైటిల్, గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ అంతా అక్కడి మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా ప్రభాస్‌ అక్కడ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాహుబలి తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ మారిపోయింది. వరుసపెట్టి భారీ బడ్జెట్‌ సినిమాలే తీస్తున్నారు. సాహో, ఆదిపురుష్, సలార్.. కల్కీ 2898 ఏడీ ఇలా పెద్ద సినిమాలే వస్తున్నాయి. అయితే.. కల్కి 2898 ఏడీ సినిమాలో బ్లూ స్క్రీన్‌ సన్నివేశాలే ఎక్కువ ఉంటాయి. ఈ సందర్భంగా అక్కడి మీడియా ప్రభాస్‌ను ఇలా ప్రశ్నించింది. బ్లూ స్క్రీన్‌ సన్నివేశాలు బోర్‌ కొట్టించాయా అని అడిగారు. దానికి ముందు చాలా బోర్‌గా అనిపించేది.. అంతపెద్ బ్లూ స్క్రీన్‌ ముందే చిన్నగా కనిపించేవాడిని అన్నారు. కానీ.. గ్లింప్స్‌ చూశాక ఎంతో హ్యాపీగా అనిపించిందని చెప్పారు. మొత్తానికి మంచి ఎక్స్‌పీరియన్స్ అని ప్రభాస్ చెప్పారు.

ఆ తర్వాత కూడా మీడియ ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. ఆ క్రమంలోనే రామ్‌చరణ్‌, రాజమౌళి గురించి ప్రస్తావన వచ్చింది. రాజమౌళి, రామ్‌చరణ్‌ గురించి మాట్లాడిన ప్రభాస్.. భారత్‌లో ఉన్న అద్భుత దర్శకుల్లో రాజమౌలి ఒకరు అని కొనియాడారు. ఆర్ఆర్ఆర్ వంటి గొప్ప సినిమా తీశారని పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటకు ఆస్కార్‌ రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ప్రభాస్ అన్నారు. అది దేశ ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించామని ప్రభాస్ అన్నారు. ఇలాంటి అవార్డులకు రాజమౌళి అర్హుడని చెప్పారు. ఇక రామ్‌చరణ్‌ తనకు ఎంతో మంచి మిత్రుడని ప్రభాస్ తెలిపారు. ఏదో ఒక రోజు రామ్‌చరణ్‌తో కలిసి కచ్చితంగా సినిమా చేస్తాం అని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్‌ ఇలా మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రభాస్, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తే వేరే లెవెల్‌ అనుకుంటున్నారు సినీ అభిమానులు.

సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాగా ‘కల్కి 2898 ఏడీ’ రూపొందుతోంది. పోస్టర్ల నుంచి తాజాగా వచ్చిన గ్లింప్స్‌ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. దీంట్లో అగ్రనటులు అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్‌ కూడా నటిస్తుండటంతో భారీ హోప్స్‌ పెట్టుకున్నారు అభిమానులు. నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తోంది. సంక్రాంతికే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Next Story