పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. ఆయనే టార్గెట్?

ప్రముఖ టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By News Meter Telugu
Published on : 17 July 2023 8:32 PM IST

Poonam Kour, Tweet, Political Leader,

పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. ఆయనే టార్గెట్? 

ప్రముఖ టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ నాయకుడిని టార్గెట్ చేసుకుని పేరు ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు. నిజంగా మహిళల పట్ల నిజంగా సానుభూతి కలిగి ఉన్న వారిలా.. కొందరు తమ గొంతు చించుకుని మహిళల సమస్యల గురించి అరుస్తున్నారని ట్వీట్ చేశారు. నిజానికి వారు ఢిల్లీలో మహిళా రెజ్లర్లు రోజుల తరబడి ఆందోళనలు చేసినా ఒక్క మాట మాట్లాడలేదని.. వారికి ప్రయోజనంగా అనిపించినప్పుడే, వారికి సానుకూలంగా ఉన్నప్పుడే ఇలా మాట్లాడే కొందరు ఫేక్ లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.

ఆ వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించినవని పలువురు భావిస్తూ కామెంట్లు చేశారు. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ ఏపీలో మహిళల అదృశ్యం గురించి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న ఓ బీజేపీకి చెందిన నాయకుడిపై మహిళా రెజ్లర్లు ఆందోళనలు చేపట్టారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని.. ఎందుకంటే ఆయన బీజేపీకి మద్దతు ఇస్తున్నారని అందుకే సైలెంట్ గా ఉన్నారంటూ కొందరు విమర్శలు గుప్పించారు.

Next Story