పూజా హెగ్డే.. అక్కడే సెటిల్ అవ్వబోతుందా..?

Pooja Hegde starts building her dream home.పూజా హెగ్డే.. ఒకప్పుడు హిట్ అంటూ చూడని ఆమెకు.. దువ్వాడ జగన్నాథం సినిమా

By M.S.R  Published on  28 Oct 2021 8:36 AM GMT
పూజా హెగ్డే.. అక్కడే సెటిల్ అవ్వబోతుందా..?

పూజా హెగ్డే.. ఒకప్పుడు హిట్ అంటూ చూడని ఆమెకు.. 'దువ్వాడ జగన్నాథం' సినిమా తర్వాత ఫేట్ మారిపోయింది. టాలీవుడ్ లో వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతోంది. ఆమె బాలీవుడ్ లో కూడా పెద్ద పెద్ద స్టార్స్ తో సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. రెమ్యునరేషన్ విషయంలో కూడా అమ్మడు డిమాండ్ చేస్తున్న డబ్బులు ఇస్తున్నారు నిర్మాతలు. హిట్ల మీద హిట్లు కొడుతున్న బుట్టబొమ్మను హీరోయిన్ గా తీసుకోవాలని పలు హీరోలు కూడా సూచిస్తూ ఉన్నారు. పూజా న‌టించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. 'రాధే శ్యామ్', 'ఆచార్య' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఇక పూజా హెగ్డే ముంబైలో తన కలల ఇంటిని నిర్మించడంలో ముందుకు వెళుతోంది. పూజా హెగ్డే కొత్తగా నిర్మిస్తున్న తన ఇంటి చిత్రాలను అభిమానులతో పంచుకుంది. " బిల్డింగ్ మై డ్రిమ్స్" అని క్యాప్షన్ తో ఇంటి పనులను పరిశీలిస్తున్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూజ హెగ్డే సొంతింటి నిర్మాణ పనులను ఆమె తల్లి పర్యవేక్షిస్తోందట. ఈ సందర్భంగా పూజ తన తల్లిని 'సూపర్ మామ్' అంటూ అభివర్ణించింది. ఇక 'రాధేశ్యామ్' నుండి పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన టీజర్ లాంటిది రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. హిందీలో సల్మాన్‌ ఖాన్‌ సరసన 'భాయిజాన్‌', రణ్‌వీర్‌ సింగ్‌తో 'సర్కస్‌' చిత్రాలు చేస్తున్నారు పూజ. సౌత్‌లో మహేశ్‌ బాబు, ప్రభాస్, పవన్‌ కల్యాణ్, విజయ్‌ చిత్రాలలో కూడా నటిస్తోంది.

Next Story
Share it