ఆ పని చేస్తేనే పెద్ద సినిమాల్లో చాన్స్: నటి పాయల్‌ ఘోష్

పెద్ద సినిమాల్లో నటించాలంటే కమిట్‌మెంట్‌ ఇవ్వాల్సి ఉంటుందని పాయల్‌ ఘోష్‌ వ్యాఖ్యానించింది.

By Srikanth Gundamalla  Published on  11 July 2023 1:19 PM IST
Payal Ghosh, Comments, casting couch, Movies,

ఆ పని చేస్తేనే పెద్ద సినిమాల్లో చాన్స్: నటి పాయల్‌ ఘోష్

నటిగా తక్కువ సినిమాలే చేసినా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్‌ ఘోష్. మంచు మనోజ్‌ హీరోగా నటించిన ప్రయాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమాలో చిత్ర పాత్రలో మెరిసింది బెంగాలీ భామ పాయల్‌ ఘోష్‌ (Payal Ghosh). తక్కువ సినిమాలే చేసినా నటిగా మెస్మరైజ్‌ చేసింది. తాజాగా తన కొత్త సినిమా అప్‌డేట్‌ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్‌ మీడియాతో పాటు.. ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి.

ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు, ఎక్కువ పాత్రల్లో నటించే అవకాశం రావాలంటే కమిట్‌మెంట్‌ (you need to sleep) ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఫైర్‌ ఆఫ్‌ లవ్‌: రెండ్‌ సినిమా తన 11వ ప్రాజెక్టు అని చెప్పింది. అయితే.. తను ఎవరితో అయినా కమిట్‌ అయ్యి ఉంటే తనకిది 30వ సినిమా అయ్యి ఉండేదని తెలిపింది. ఇండస్ట్రీలో రాణించాలనుకుంటే అప్‌కమింగ్‌ యాక్టర్లు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడింది. పని చేసుకునే వాతావరణం ప్రాధాన్యతను మరోసారి అందరికీ గుర్తు చేసింది. గతంలో పాయల్‌ ఘోష్‌ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పైనా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అప్పుడు కూడా ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా పాయల్‌ ఘోష్‌ కమిట్‌మెంట్‌ గురించి మాట్లాడటం సంచలనంగా మారింది.

కాగా.. గతంతో పోలిస్తే ప్రస్తుతం క్యాస్టింగ్‌ కౌచ్ తగ్గిందని.. జనాల్లో అవగాహన పెరగడం వల్లే ఇది సాధ్యమైందని పాయల్‌ ఘోష్‌ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌కు ఎప్పుడు చెక్‌ పడుతుందో అని ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పారు.

Next Story