తమ్ముడు రీరిలీజ్.. పవన్ కళ్యాణ్ కుమారుడు సందడి
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'తమ్ముడు' సినిమా ఈ రోజుకు విడుదలై 25 సంవత్సరాలు.
By M.S.R Published on 15 Jun 2024 8:30 PM ISTతమ్ముడు రీరిలీజ్.. పవన్ కళ్యాణ్ కుమారుడు సందడి
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'తమ్ముడు' సినిమా ఈ రోజుకు విడుదలై 25 సంవత్సరాలు. ఈ సినిమా విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ మొదటి కుమారుడు అకిరా నందన్ హైదరాబాద్‌లో తన తండ్రి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని చూడటానికి థియేటర్ లో కనిపించడం అభిమానుల్లో మరింత జోష్ కనిపించింది. 25 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ఈరోజు (జూన్ 15) థియేటర్లలో విడుదలైంది. PA అరుణ్ ప్రసాద్ రచన, దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మొదట 1999లో విడుదలైంది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫేవరెట్ చిత్రాల్లో ఒకటి.
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత, అకిరా నందన్ తన తండ్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిసినప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. విజయవాడలో జరిగిన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి అకీరా తన సోదరి, మెగా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యాడు. అకీరాను సినిమాల్లో హీరోగా తీసుకుని రావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే అకీరా కెరీర్ అతడి ఇష్టమేనని అతడి తల్లి రేణు దేశాయ్ ఇప్పటికే పలు మార్లు చెప్పేశారు.