'భగవంత్ కేసరి' సినిమాలో యూపీ ముద్దుగుమ్మ కీలక పాత్ర!
భగవంత్ కేసరి సినిమాలో యూపీ భామ పలక్ లల్వానీని తీసుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 5:22 PM IST'భగవంత్ కేసరి' సినిమాలో యూపీ ముద్దుగుమ్మ కీలక పాత్ర!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. ఎన్‌బీకే 108వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర యూనిట్ ఇప్పటికే బాలయ్య, కాజల్, శ్రీలీల పోస్టర్లను విడుదల చేశారు. అవి నెట్టింట తెగ హల్ చేశాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా భగవంత్ కేసరి సినిమా వస్తోంది. ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్‌లో కాజల్ యాక్ట్ చేస్తుండగా.. మరో పాత్రలో శ్రీలీల కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరో కీలక పాత్రలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ముద్దుగుమ్మ నటిస్తుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
భగవంత్ కేసరి సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. బాలయ్య సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు అనిల్ రావిపూడి టీమ్ యూపీ భామ పలక్ లల్వానీని తీసుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఆమె కూడా ఆ కీ రోల్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పలక్ లల్వాని జువ్వ, అబ్బాయితో అమ్మాయి సినిమాల్లో నటించింది. మరి ఈ మద్దుగుమ్మ భగవంత్ కేసరి సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతుంది అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
బాలకృష్ణ ఇప్పటి వరకు దాదాపుగా రాయలసీమ యాసలో అభిమానులను అలరించారు. భగవంత్ కేసరిలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ కనిపించబోనున్నారు. భగవంత్ కేసరి సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి లెవల్‌లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందని.. ఈసారి థియేటర్లలో పూనకాలు కచ్చితమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.