OTT అంటే బూతు మాత్రమేనా? స్టార్స్‌కు ఏమైంది..?
విచ్చలవిడిగా బూతులు, శృంగార సీన్లు ఓటీటీ వెబ్ సిరీసుల్లో కనిపిస్తాయి. ఇక చాలా వరకు జనాలు కూడా..
By Srikanth Gundamalla Published on 22 Jun 2023 3:30 PM ISTOTT అంటే బూతు మాత్రమేనా? స్టార్స్‌కు ఏమైంది..?
కరోనా సమయంలో థియేటర్లు మూతపడ్డాయి. అప్పటి నుంచి ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. జనాలు ఇళ్లలోనే ఉండటంతో ఓటీటీల్లో విడుదలయిన సినిమాలను చూసేవారు. ఇక వెబ్‌సిరీస్‌లు అయితే కరోనా సమయంలోనే తెలుగు ప్రజలకు దగ్గరయ్యాయని చెప్పాలి. సినిమాలకు సెన్సార్ ఉంటుంది. అభ్యంతరకర మాటలు, సన్నివేశాలను తొలగిస్తుంది. ఓటీటీ అలా కాదు. సెన్సార్ ఉండదు. దీంతో.. విచ్చలవిడిగా బూతులు, శృంగార సీన్లు ఓటీటీ వెబ్ సిరీసుల్లో కనిపిస్తాయి. ఇక చాలా వరకు జనాలు కూడా బోల్డ్‌గా ఉన్న డైలాగ్స్‌కే అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పెద్ద స్టార్లు.. ఫ్యామిలీ హీరో అని పేరున్నవారు.. హోమ్లీ హీరోయిన్లు కూడా ఓటీటీల్లోకి అడుగుపెట్టి బోల్డ్ డైలాగ్స్ చెబుతున్నారు. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారుతున్నారు.
ది ఫ్యామిలీ మెన్ సీక్వెల్‌గా వచ్చిన వెబ్‌సిరీస్ ది ఫ్యామిలీ మెన్-2. ఇందులో తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్న హీరోయిన్ సమంత నటించారు. వెబ్‌సిరీస్‌లో సమంత ఉందనడంతో అందరూ ఆసక్తి చూపారు. కానీ ఓటీటీలో విడుదలయ్యాక ఆమె ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ఆమె అప్పటి వరకు కనిపించనంత బోల్డ్ సీన్లలో నటించింది. దాన్ని ఆడియన్స్ తీసుకోలేకపోయారు. అంతేకాదు.. అప్పటికీ సమంత, నాగచైతన్య విడిపోలేదు. అక్కినేని కోడలుగా ఉంటూ బోల్డ్ సీన్లలో నటించడంతో తెలుగు ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సమంత పర్సనల్ లైఫ్‌పై కూడా ప్రభావం చూపిందనే చెప్పాలి. ఇంకొన్ని కారణాలు ఉన్నా వెబ్‌సిరీస్ తర్వాత కొన్నాళ్లకే సమంత, నాగచైతన్య విడిపోయారు.
టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరో ఎవరంటే.. అందరూ టక్కున చెప్పే పేరు విక్టరీ వెంకటేశ్. ఆయన ఈ మధ్యకాలంలో రానా నాయుడు వెబ్‌సిరీస్‌లో నటించారు. వెంకటేశ్ సినిమాలు థియేటర్లలో విడదలైతే ఇంటిల్లిపాది వెళ్లి చూసేవారు. కానీ.. రానా నాయుడు సిరీస్‌లో వెంకటేశ్ డైలాగ్స్ అందరినీ షాక్‌కు గురిచేశాయి. ఎప్పుడూ విననంత బూతులు ఆయన అవలీలగా చెప్పేశారు. వెంకటేశ్ కోసం ఈ సిరీస్ చూసినవారంతా మరీ ఇంతలా బూతులు చెప్పించారేంటి అంటూ డైరెక్టర్‌పైనా విమర్శలు చేశారు. అశ్లీలత కూడా ఎక్కువగా ఉండటంతో రానా నాయుడు వెబ్ సిరీస్‌పై విమర్శలు ఎక్కువగానే వచ్చాయి. అయితే.. దీనికి సీక్వెల్ కూడా ఉంది. మరి పార్ట్-2లో అయినా బూతులు తగ్గిస్తారా? లేదంటే సెన్సార్ లేదా అని కొనసాగిస్తారా చూడాలి.
తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరున్న హీరోయిన్లలో తమన్నా భాటియా కూడా ఒకరు. ఈమె మంచి క్యారెక్టర్స్ చేస్తూ తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది. చాలా కాలంగా ఈమె చేతిలో సినిమాలు లేవు. దీంతో.. ఓటీటీ బాట పట్టింది. తాజాగా లస్ట్ స్టోరీస్ సిరీస్ పార్ట్-2లో నటించింది. లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ జూన్ 21 రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ ట్రైలర్ లో పెళ్లయిన విజయ్.. పెళ్లి కాని తమన్నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు చూపించారు. తరచూ ఆమె ఇంటికి వచ్చి రొమాన్స్ చేయడం ఈ ట్రైలర్ లో కనిపించింది.ఇక ఈ లస్ట్ స్టోరీస్ 2 కూడా.. తొలి పార్ట్ లాగే మొత్తం కామం చుట్టే తిరిగింది. తమన్నా దీనికి ముందు జీ కర్దా సిరీస్‌లోనూ బోల్డ్‌గానే నటించింది. వరుసగా వెబ్‌సిరీస్‌ల్లో శృంగార సీన్లలో తమన్నా కనిపించడంతో.. తెలుగు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.
అభ్యంతరకరమైన సన్నివేశాలు, బూతులు లేకుండా సిరీస్‌లు చేయకూడదని ఓటీటీ నిర్మాతలు అయ్యారా ఏంటి? అనిపిస్తోంది. స్టార్లు బూతులు మాట్లాడుతూ, బోల్డ్ సీన్లలో నటించడంపై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నటీనటుల్లో ఉన్న విచక్షణా జ్ఞానం లేదా? డబ్బులిస్తే ఎంతకైనా దిగజారుతారా? మీ నుంచి నేటి తరం నేర్చుకోవాల్సింది ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమాలకు ఉన్నట్లే సిరీస్‌లకు కూడా సెన్సార్ పెట్టాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.