OTTలోకి వచ్చేస్తున్న శివ కార్తికేయన్ 'మహావీరుడు'.. ఎప్పుడు, ఎక్కడంటే..
హీరో శివకార్తికేయన్ నటించిన సినిమా 'మహావీరుడు' అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తుంది.
By Srikanth Gundamalla Published on 7 Aug 2023 3:52 PM ISTOTTలోకి వచ్చేస్తున్న శివ కార్తికేయన్ 'మహావీరుడు'.. ఎప్పుడు, ఎక్కడంటే..
ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక కొత్త సినిమాలు త్వరగా అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న సినిమాలకు మూడు వారాల సమయం పడితే.. ఇక పెద్ద సినిమాలు కూడా 4 నుంచి 5 వారాల్లో ఓటీటీల్లో దర్శనం ఇస్తున్నాయి. దాంతో.. చాలా మంది ఆయా ఓటీటీ సబ్‌స్క్రైబ్ చేసుకుని థియేటర్లకు వెళ్లేందుకు వీలులేకపోతే ఇంట్లోనే కొత్త సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో తమిళంలో స్పీడ్‌గా సినిమాలు తీస్తూ.. హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు హీరో శివకార్తికేయన్. వేగంగా దూసుకెళ్తున్నారు. అయితే.. శివకార్తికేయన్ సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు దాన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇటీవల శివ కార్తికేయన్ నటించిన సినిమా 'మహావీరుడు' తెలుగులో పెద్ద ప్రభావం చూపించలేకపోయింది. అయితే.. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
తొలుత సైడ్ క్యారెక్టర్స్‌లో కనిపించిన శివ కార్తికేయన్.. మెల్లిగా హీరోగా వచ్చాడు. ఇప్పుడు తొలిరోజే 20కి పైగా కోట్ల రూపాయల వసూళ్లు రాబడుతున్నాడు. ఇక శివకార్తికేయన్‌కు తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా క్రేజ్ ఉంది. రెమో, డాక్టర్, డాన్ వంటి సినిమాలతో తెలుగులో మార్కెట్ పెంచుకున్నాడు. కాగా.. తెలుగులో శివకార్తికేయన్ నేరుగా నటించిన సినిమా 'ప్రిన్స్' మాత్రం మెప్పించలేకపోయింది. మహావీరుడు సినిమా కూడా నిరాశపరిచింది. తెలుగులో ఆ సమయంలో విడుదలైన బేబీ సినిమా వసూళ్ల దాటికి మహావీరుడు సినిమా నిలబడలేకపోయింది.
ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఆగస్టు 11వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగులో మహావీరుడు సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించారు. శివకార్తికేయన్ సరసన శంకర్ తనయిక అదితి శంకర్ నటించింది. శాంతి టాకీస్ బ్యానర్‌పై రూపొందిన మహావీరుడు మూవీలో సునీల్ కీలక పాత్రలో నటించారు.