నా ప్రతి కన్నీటి చుక్కకు అభిమానులూ బాధపడ్డారు: ఎన్టీఆర్ (వీడియో)

సైమా అవార్డు అందుకున్న తర్వాత యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్‌ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  16 Sep 2023 5:30 AM GMT
NTR, SIIMA Awards-2023, Emotional Speech, Video,

 నా ప్రతి కన్నీటి చుక్కకు అభిమానులూ బాధపడ్డారు: ఎన్టీఆర్ (వీడియో)

సైమా అవార్డ్స్-2023 వేడుకలో ఉత్తమ నటుడిగా జూనియర్‌ ఎన్టీఆర్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటనకు గాను ఆయన్ని ఈ అవార్డు వరించింది. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ వేడుకలు రెండ్రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే.. అవార్డు అందుకున్న క్రమంలో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన స్పీచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు అందుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కొమురంభీం పాత్ర కోసం నేను న్యాయం చేస్తానని నన్ను మళ్లీ మళ్లీ నమ్మించినందుకు జక్కన్నకు కృతజ్ఞతలు తెలిపారు. తన కో స్టారో.. స్నేహితుడు రామ్‌ చరణ్‌కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్. ఇక అభిమానుల గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. వారికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఒడిదుడుకుల్లో.. తాను కింద పడ్డపుడల్లా పట్టుకుని పైకి లేపారని అన్నారు. 'నా కంటి వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు అభిమానులు కూడా బాధపడ్డారు.. నేను నవ్వినప్పుడల్లా నాతో నవ్వారు.. నా అభిమాన సోదరులు అందరికీ తలవంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను' అని తారక్ భావోద్వేగంగా మాట్లాడారు. ఎన్టీఆర్‌ ఎమోషనల్ స్పీచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తున్న అభిమానులు.. అన్నా మీ వెంట మేం ఎప్పుడూ ఉంటామంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో ప్రస్తుతం తెరకెక్కుతోన్న దేవర చిత్రంపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే వీరి కాంబినేషన్‌లోనే గతంలో జనతా గ్యారేజ్‌ వంటి సూపర్‌ హిట్‌ సినిమా వచ్చింది. ప్రస్తుతం దేవర సినిమా చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ఇదే ఈమెకు తొలి తెలుగు సినిమా. 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది 'దేవర'.

Next Story