హృతిక్, ఎన్టీఆర్ 'వార్-2' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చిన వార్ సినిమా పెద్ద హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 2:30 PM ISTహృతిక్, ఎన్టీఆర్ 'వార్-2' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చిన వార్ సినిమా పెద్ద హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు సీక్వెల్‌గా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ బ్యానర్‌లో వార్-2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఈ మూవీలో హృతిక్ రోషన్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. దాంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. వార్-2 సినిమా కోసం బాలీవుడ్ మాత్రమే కాదు.. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇంత హైప్ ఉన్న ఈ మూవి గురించి చిత్ర యూనిట్ సంచలన ప్రకటన చేసింది. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
కాగా.. వార్-2 సినిమా షూటింగ్ ఇటీవలే స్పెయిన్‌లో నిర్వహించారు. షెడ్యూల్‌లో షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన స్టిల్స్ ఇప్పటికే నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. సినిమా విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. వార్-2 సినిమాను 2025 సంవత్సరం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్ బ్యానర్‌లో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్-3 సినిమాల తర్వాత ఆరో ప్రాజెక్టు కావడం మరో విశేషం. ఈ బ్యానర్‌లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాశాయి. టైగర్-3 ఎండింగ్‌లో వార్-2 గ్లింప్స్ ప్లే చేశారు. అప్పట్నుంచి ప్రేక్షకులు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. దేవర మూవీలో బాలీవుడ్ హీరోయిన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దేవర సినిమాలో మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కానుంది.
#War2 BTS : Car Chase Action Sequence Shoot is going on...Hrithik will Join them very soon...😉#War2 #HrithikRoshan #JrNTR ❤️#ManOfMassesNTR #Devara #Fighter pic.twitter.com/cfj8OIq5n5
— Scroll & Play (@scrollandplay) October 18, 2023
#War2 Car chase sequence in Spain. #HrithikRoshan #JrNtr #War2 pic.twitter.com/OwKCpxVIOe
— Mir Aleem (@Aleem1169966) October 18, 2023