ఆ పాత్ర ఎన్టీఆర్ తప్ప మరెవరూ చేయలేరు: బాలీవుడ్ డైరెక్టర్
హీరో ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు బాలీవుడ్ డైరెక్టర్ అనిల్ శర్మ.
By Srikanth Gundamalla
ఆ పాత్ర ఎన్టీఆర్ తప్ప మరెవరూ చేయలేరు: బాలీవుడ్ డైరెక్టర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి అందరూ పొగుడుతారు. ఆయన ఏ1 స్టార్ అని.. ఒక్క షాట్‌లోనే ఒకే చేసేస్తారని చెబుతుంటారు. అయితే.. ఆయన యాక్టింగ్ గురించి టాలీవుడ్‌లోనే కాదు.. ఆర్ఆర్ఆర్ తర్వాత అన్ని చోట్ల తెలిసిపోయింది. ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వార్ 2 (War 2) వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ కూడా భాగం కావాలంటూ మేకర్స్ సంప్రదించడం, ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయింది. తాజాగా ఒక బాలీవుడ్ దర్శకుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా.. హీరో ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు బాలీవుడ్ డైరెక్టర్ అనిల్ శర్మ.
ఎన్టీఆర్ నటన ఎంతో గొప్పగా ఉంటుందని బాలీవుడ్ దర్శకుడు అనిల్ శర్మ అన్నారు. బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన'గదర్' సినిమా పెద్ద హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కలెక్షన్లలో రికార్డులను తిరగరాసింది. అయితే.. ఈ సినిమాలో నేటి తరం హీరోలతో చేయాల్సి వస్తే.. తారాసింగ్ పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే సరితూగుతారని డైరెక్టర్ అనిల్ శర్మ అన్నారు. తారాసింగ్ పాత్రకు న్యాయం చేగలిగే యువ హీరోలు బాలీవుడ్‌లో లేరు అని.. దక్షిణాదిలో చాలా మంది ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే ఈ పాత్రకు సరైన న్యాయం చేస్తారని చెప్పారు అనిల్ శర్మ. తాజాగా.. అనిల్ శర్మ ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాలు వెల్లడించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. తారక్ అభిమానులు ఆయన వ్యాఖ్యలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ‘గదర్ ఏక్ ప్రేమ్ కథ’ 2001లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. ఇందులో సన్నీ దేఓల్.. తారాసింగ్ పాత్ర పోషించారు. ఇదే చిత్రానికి సీక్వెల్‌గా దాదాపు 22 ఏళ్ల తర్వాత అనిల్ ‘గదర్ 2’ సిద్ధం చేశారు. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.500 కోట్లు వసూళ్లు రాబట్టింది. పాక్ చెరలో బందీగా ఉన్న తన కుమారుడిని విడిపించుకోవడానికి తారాసింగ్ ఏం చేశాడు? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తీశారు.
An actor like NTR is best suitable for Tara Singh role in Gadar among the current generation actors : #Gadar & Gadar 2 director Anil Sharma #Gadar2 #NTR pic.twitter.com/QHZM1iwKDV
— Vamsi Kaka (@vamsikaka) September 3, 2023