ఎన్టీఆర్‌ 'దేవర' సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్

ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి మేకర్స్‌ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  7 Nov 2023 9:30 PM IST
NTR, devara movie, update, koratala siva, janhvi kapoor,

ఎన్టీఆర్‌ 'దేవర' సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నుంచి వస్తోన్న మరో ప్రతిష్టాత్మక చిత్ర 'దేవర'. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులు, సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. సముద్ర నేపథ్యంలో సాగే కథతో పాటు ఇప్పటి వరకు ఎన్నడూ చూడని విధంగా ఇందులో కొన్ని సీన్స్‌ ఉంటాయని చెబుతున్నారు. దాంతో.. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా... ఎన్టీఆర్‌ దేవర సినిమా నుంచి మేకర్స్‌ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. భయానికి కొత్త పేరు దేవర.. మరో 150 రోజుల్లో థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు అంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు. అప్పటి వరకు ఎదరు చూడండి అంటూ పోస్టర్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ పోస్టర్‌ తెగ వైరల్ అవుతోంది. అభిమానులు లైక్స్‌ కొడుతూ.. షేర్‌ చేస్తున్నారు. వీ ఆర్‌ వెయిటింగ్‌ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తారక్‌కు మరోసారి బిగ్‌ హిట్‌ పడబోతుందని దీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్‌ పేరు ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయింది. ఆయన ఒక్కరే కాదు.. ఆ సినిమాలో ఉన్న వారందరీకి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు లభించింది. కాగా.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌ గోవాలో శరవేగంగా సాగుతోందని తెలుస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా కనిపంచనుంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదలైంది. లంగాఓణీలో కనిపించిన ఆమెకు సంబంధించిన ఫొటో అందరినీ ఆకట్టుకుంది.

ఇక ఎన్టీఆర్‌ సినిమా దేవరలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, కోసరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. రెండుభాగాలుగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది.

Next Story