రెండు భాగాలుగా ఎన్టీఆర్ 'దేవర'.. ప్రకటించిన డైరెక్టర్ కొరటాల శివ

'దేవర' సినిమాను రెండు భాగాలుగా రూపొందించి విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ వెల్లడించారు.

By Srikanth Gundamalla  Published on  4 Oct 2023 5:15 PM IST
NTR, Devara Movie, two parts, director, koratala Siva,

రెండు భాగాలుగా ఎన్టీఆర్ 'దేవర'.. ప్రకటించిన డైరెక్టర్ కొరటాల శివ

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. భారీ మాస్‌ యాక్షన్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. టాలీవుడ్‌ నుంచి గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్‌ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దాంతో.. యువ సుధా ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా హై టెక్నికల్‌ వాల్యూస్‌తో దేవర సినిమాను రూపొందిస్తున్నారు. అయితే.. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని కొద్ది రోజులుగా చర్చజరుగుతోంది. ఈక్రమంలో మూవీ డైరెక్టర్ కొరటాల శివ స్పందించారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు.

'దేవర' సినిమాను రెండు భాగాలుగా రూపొందించి విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ సోషల్‌ మీడియాలో వీడియో ద్వారా వెల్లడించారు. నిజానికి ఈ కథ కాన్వాయ్ చాలా పెద్దదిగా ఉండటంతో ఒక పార్ట్ లో చెప్పడం కష్టమని కొరటాల శివ భావించారు. ముందుగా సినిమాను ఒకే భాగంలో తీయాలని భావించినా రానురాను ఒక్క పార్ట్‌లో చెప్పడం కష్టమని భావించారు. ఆడియన్స్ కి మరింతగా చేరువ చేయడానికి రెండు పార్టులు అవసరం అని తమ టీమ్ మొత్తం భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కొరటాల. అలానే సినిమాని ఎంతో గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నామని చెప్పారు.

అంతేకాకుండా ఎంతో మంది స్టార్‌ క్యాస్టింగ్‌.. ఎంతో హై వోల్టేజ్‌తో సినిమాను మొదలుపెట్టామన్నారు. ముందుకు వెళ్లే కొద్ది ఇంకా ఇంకా పెరుగుతూ వచ్చిందని కొరటాల చెప్పారు. ఆదరాబాదరాగా అన్ని క్యారెక్టర్స్‌ను ఒకే పార్ట్‌లో కుదించేయలేమని అన్నారు. ఇంతపెద్ద సినిమాను రెండు భాగాలుగా తీస్తే అందరి క్యారెక్టర్స్‌ డెప్త్‌గా చెప్పొచ్చని.. ప్రేక్షకుల్లోకి బాగా వెళ్తుందని భావించామన్నారు కొరటాల శివ. ఇక దేవర సినిమా రెండు పార్టులుగా వస్తుందని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొదటి పార్ట్ అనుకున్నట్లే 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుందని స్పష్టం చేశారు. కాగా ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ నటిస్తోంది.

Next Story