'దేవర' సినిమా షూటింగ్ స్పాట్ నుంచి వీడియో లీక్.. ఎందుకిలా చేశారు..?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్ర 'దేవర'. ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By Srikanth Gundamalla Published on 22 March 2024 11:58 AM IST'దేవర' సినిమా షూటింగ్ స్పాట్ నుంచి వీడియో లీక్.. ఎందుకిలా చేశారు..?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్ర 'దేవర'. ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమా ఉంది. అయితే.. తాజాగా దీని చిత్రీకరణ గోవాలో జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో యాక్షన్ పార్ట్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ గత ఆదివారం గోవాకు వెళ్లింది. అక్కడ కూడా యాక్షన్ సీన్స్‌తో పాటు ఓ పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గోవాలో దేవర సినిమా షూటింగ్ జరుగుతుందగా.. కొందరు వీడియో తీశారు. షూటింగ్ స్పాట్‌లో ఉన్న వ్యక్తులు ఎవరో అక్కడ వీడియో తీసి ఆతర్వాత దాన్ని నెట్టింట అప్‌లోడ్ చేశారు. ఎన్టీఆర్ సముద్రం ఒడ్డున నలుపు రంగు చొక్కా.. అదే రంగులో ఉన్న పంచ కట్టుకుని నడుస్తూ ఉన్నాడు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లో బంధించిన కొందరు దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటం.. ఎన్టీఆర్ సినిమా కావడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు దీని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆకతాయిలు చేసిన పనిగానే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం కాస్త లోతుగా ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో లీక్‌ల ట్రెండ్ నడుస్తోందనీ.. సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిటే ఇలా చేసి ఉంటుందని ఇంకొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఎలా జరిగినా కూడా సినిమాకు మాత్రం మంచి హైప్ వస్తుందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. ఇక ఇటీవల విడుదలైన టీజర్ అభిమానులను ఉర్రూతలూగించింది. టీజరే ఈ రేంజ్‌లో ఉందంటే.. సినిమా ఎలా ఉంటుందో అని భారీ అంచనాలు పెట్టుకున్నారు. దేవర మూవీ మొదటి పార్ట్ దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు. కాగా.. దమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు.