'సముద్రం కత్తులు, నెత్తురునే చూసింది..' ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న కొత్త సినిమా 'దేవర'. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 8 Jan 2024 5:08 PM IST'సముద్రం కత్తులు, నెత్తురునే చూసింది..' ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న కొత్త సినిమా 'దేవర'. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రతిష్టాత్మకంగా ఈ దేవర సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. దేవర సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతకాలం నుంచి ఈ సినిమా నుంచి అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు చిత్ర యూనిట్ గుడ్‌న్యూస్ అందించింది. తాజాగా దేవర సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుదల
చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమాను విడుదలైన పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా వచ్చిన గ్లింప్స్ కూడా అదిరిపోయింది. యాక్షన్ సీన్లు సూపర్‌గా ఉన్నాయి. అలాగే.. ఎన్టీఆర్ డైలాగ్స్ కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇక సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. దేవర సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నట్లు ఇప్పటికే కొరటాల శివ చెప్పారు. మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వనుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. మొదటి నుంచి ఈ దేవర సినిమాపై ఎన్టీఆర్ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో.. అభిమానులు కూడా ఈ మూవీపై చాలా అంచనాలను పెట్టుకున్నారు.
ఇప్పటికే రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత మరో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు ఎన్టీఆర్. మరోవైపు కొరటాల శివకు కూడా సక్సెస్ అందించాలని చూస్తున్నారు. దేవర నుంచి విడుదలైన గ్లింప్స్ మూవీపై హైప్‌ను మరింత పెంచింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగలా ఉంటుందని భావిస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని అర్థమవుతోంది. అలాగే గ్లింప్స్ చివరన ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అభిమానుల మైండ్‌ల నుంచి పోయేలా లేదు. ఎంతుకంటే అంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయి ఆ డైలాగ్స్. ఇప్పటి వరకు దేవర సినిమా గురించి చెప్పిందంతా నిజమే అని ఈ ఒక్క గ్లింప్స్‌ను చూస్తే అర్థం అవుతోంది. సముద్రం నుంచి వస్తున్న అలలు మొత్తం ఎరుపు రంగులోకి మారడం గ్లింప్స్‌లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో యాక్షన్ సీన్లు ఓ రేంజ్‌లో ఉంటాయని అర్థం అవుతోంది. చివరన ఎన్టీఆర్ చెప్పిన 'ఈ సముద్రం చేపలను కంటే కత్తులను, నెత్తురును ఎక్కువ గా చూసి ఉండాది.. అందుకే దీన్ని ఎర్రసముద్రం అంటారు' అంటూ బేస్ వాయిస్‌తో ఉన్న డైలాగ్ అదిరిపోయింది.