నిత్యా మీనన్ ఇంట్లో విషాదం..ఒక శకం ముగిసిందంటూ ఎమోషనల్ పోస్ట్
హీరోయిన్ నిత్యా మీనన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 16 July 2023 12:48 PM ISTనిత్యా మీనన్ ఇంట్లో విషాదం..ఒక శకం ముగిసిందంటూ ఎమోషనల్ పోస్ట్
హీరోయిన్ నిత్యా మీనన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిత్యామీనన్ ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ చనిపోయారు. ఈ విషాద సంఘటన గురించి స్వయంగా నిత్యా మీననే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇన్‌స్టాలో తన అమ్మమ్మ, తాతయ్యతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. అయితే.. నిత్య షేర్ చేసిన పోస్టును చూసి అభిమానులు, ఇతర సెలబ్రిటీలు ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.
నిత్యా మీనన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇలా రాసుకొచ్చారు.. ‘ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్ (తాతయ్య)ను బాగా చూసుకుంటా’ అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టింది. తాతయ్య అమ్మమతో దిగిన ఫొటోను కూడా షేర్ చేసింది నిత్యామీనన్. దాంతో.. నిత్య లాస్‌కు ఎంతో చింతిస్తున్నామని.. దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలంటూ కోరుకుంటున్నామని ఆమె అభిమానులు, సెలబ్రిటీలు కోరుకుంటున్నట్లు కామెంట్స్‌లో చెబుతున్నారు.
అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిత్యా మీనన్. నితిన్‌తో ‘ఇష్క్’ సినిమాలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా నిత్యతో పాటు.. నితిన్‌కు తిరుగులేని హిట్‌ను తెచ్చిపెట్టింది. ఇక నిత్య తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది.