అప్పుడే OTTలోకి వచ్చేస్తోన్న నితిన్‌ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'

తాజాగా నితిన్‌ నటించిన సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది.

By Srikanth Gundamalla  Published on  19 Dec 2023 1:40 PM IST
nithin,  extra ordinary man, ott streaming,

 అప్పుడే OTTలోకి వచ్చేస్తోన్న నితిన్‌ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'

సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లోకి తొందరగా వచ్చేస్తున్నాయి. థియేటర్లలో చూడటం మిస్‌ అయిన వారు ఓటీటీల్లో కొత్త సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు రిలీజ్‌ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీల్లోకి వస్తుంటే.. ఇంకొన్ని మాత్రం రెండువారాల్లోనే దర్శనం ఇస్తున్నాయి. తాజాగా నితిన్‌ నటించిన సినిమా 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది.

నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు. నితిన్ పక్కన హీరోయిన్‌గా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటించారు. సీనియర్ హీరో రాజశేఖర్‌ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించాడు. డిసెంబర్‌ 8న థియేటర్లలో విడుదలైన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై హైప్‌ పెంచేశాయి. కామెడీ బాగున్నా.. కథనం మాత్రం సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దాంతో.. బాక్సాఫీస్‌ వద్ద 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' ఫరవాలేనదనిపించింది. ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు నితిన్.

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జనవరి చివరి వారంలో లేదంటే సంక్రాంతికి ఓటీటీలో రిలీజ్‌ చేయాలని భావించారట. కానీ.. సినిమాకు హిట్‌ టాక్‌ రాకపోవడంతో.. అనుకున్నదానికంటే ముందే ఓటీటీలో అందుబాలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. జనవరి మొదటి వారంలోనే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతుందని తెలుస్తోంది. సంక్రాంతి వీక్‌ ప్రారంభంలోనే ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఇక దీనికి సంబంధించి చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

Next Story