అభిషేక్-ఐశ్వర్య దూరంగా ఉండడానికి ఆమె కారణమన్నారు.. చివరికి

బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బచ్చన్ కుటుంబానికి కోడలు అయ్యాక ఎంతో ఆనందంగా ఉన్నానంటూ ఐశ్వర్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది

By Kalasani Durgapraveen  Published on  9 Nov 2024 11:00 AM IST
అభిషేక్-ఐశ్వర్య దూరంగా ఉండడానికి ఆమె కారణమన్నారు.. చివరికి

బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బచ్చన్ కుటుంబానికి కోడలు అయ్యాక ఎంతో ఆనందంగా ఉన్నానంటూ ఐశ్వర్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. కానీ గత కొన్ని నెలలుగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య మధ్య రూమర్స్ చాలా ఎక్కువయ్యాయి. ఐష్.. అభిషేక్ ను విడిచి వెళ్లిపోయిందని, అభిషేక్ వేరే నటితో రిలేషన్ షిప్ లో ఉన్నాడంటూ కథనాలు వండి వార్చారు. ఇక సోషల్ మీడియాలో అయితే సదరు నటిని కొందరు ఇష్టం వచ్చినట్లు తిట్టారు.

బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ ఈ వివాదానికి కేంద్రబిందువుగా నిలిచింది. బాలీవుడ్ పవర్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడిపోయారని, అందులో ఆమె ప్రమేయం ఉందంటూ పుకార్లు వ్యాపించాయి. జూమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిమ్రత్ తాను సింగిల్ గా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. తాను ఒంటరిగా ఉన్నానని, తన సింగిల్ స్టేటస్‌ని పరోక్షంగా ధృవీకరించింది. అయితే ఈ విషయాన్ని ఆమె మరింత వివరంగా చెప్పడానికి మాత్రం ముందుకు రాలేదు. అంతేకాకుండా ఆమె ఒంటరి మహిళలకు కొన్ని చిట్కాలను అందించింది. సోలో ట్రిప్ ప్లాన్‌ల గురించి కూడా చెప్పింది.

బచ్చన్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న ఒక మూలం కూడా ఈ పుకార్లను కొట్టిపారేసింది. "ఈ పుకార్లలో నిజం లేదు" అని పేర్కొంది. అభిషేక్ బచ్చన్ ఈ విషయంపై మౌనంగా ఉండటాన్ని ఎంచుకున్నారు. తదుపరి వివాదాలకు దూరంగా ఉండాలని సూచించడం వల్లనే ఈ నిర్ణయం అభిషేక్ బచ్చన్ తీసుకున్నారని భావిస్తున్నారు.

Next Story