ఇదిగో నిహారిక పెళ్లి వేడుక వీడియో

Niharika Konidela wedding ceremony I ఇదిగో నిహారిక పెళ్లి వేడుక వీడియో

By సుభాష్  Published on  9 Dec 2020 2:20 AM GMT
ఇదిగో నిహారిక పెళ్లి వేడుక వీడియో

తన కుమార్తె నిహారిక పెళ్లి వేడుక వీడియోను నాగబాబు సోషల్‌ మీడియాలో ద్వారా పంచుకున్నారు. తొలి రోజు వేడుకలంటూ తన యూట్యూబ్‌ ఛానెల్లో వీడియోను అప్‌లోడ్‌ చేశారు. నిహారికకు మంగళ స్నానం చేయించడం, ముస్తాబు చేయడం, ఆమెను కుటుంబ సభ్యులంతా ఆశీర్వదించడం తదితర ఆచారాలతో కూడిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫంక్షన్‌ పూర్తయ్యాక వధూవరులు అందరితో కలిసి ఉత్సాహంగా కోలాటాలు ఆడారు. రంగురంగుల పువ్వులు, తోరణాలు, పిల్లల అల్లర్లు, కేరింతలు, డ్యాన్స్‌లు ఇలా కుటుంబ సభ్యులతో సందడి వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

కాగా, డిసెంబర్‌ 9న రాత్రి 7:15 గంటలకు గుంటూరు మాజీ ఐజీ జొన్నల గడ్డ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యను నిహారిక మనువాడబోతున్న విషయం తెలిసిందే. నిహారిక కుటుంబ సభ్యులంతా సోమవారం ప్రైవేటు విమానంలో ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. సోమవారం రాత్రి సంగీత్‌, మంగళవారం సాయంత్రం మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ రోజు పెళ్లి జరగనుంది.

Next Story