విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన నయనతార దంపతులు

నయనతార దంపతులు విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  9 March 2024 11:01 AM IST
nayanthara, vignesh, divorce news, clarity,

 విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన నయనతార దంపతులు 

విఘ్నేశ్‌ శివన్, నయనతార పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. అయితే.. నయనతార దంపతులు విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. తాజాగా నయనతార తన భర్తను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల అన్‌ఫాలో చేసింది. మళ్లీ కాసేపటికే ఫాలో చేసింది. నేను సర్వం కోల్పోయాను అంటూ పోస్టు పెట్టడం.. మళ్లీ దాన్ని డిలీట్‌ చేయడం వంటివి ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. నయనతార, విఘ్నేశ్‌ ఈ రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు.

కవల పిల్లలతో కలిసి వెకేషన్‌కు ఫారిన్‌ టూర్‌ వెళ్తున్నట్లు వారు ఈ మేరకు సోషల్‌ మీడియాలో తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేశారు. అంతేకాదు.. నయనతార ఫొటోలను షేర్‌ చేసిన విఘ్నేశ్‌ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి నయనతార రిప్లై ఇస్తూ.. 'నన్ను ఇంత గొప్ప మహిళగా మార్చినందుకు ధన్యవాదాలు' అంటూ హార్ట్‌ ఎమోజీలు పెట్టింది. ఫారిన్‌లో ఎంజాయ్‌ చేస్తున్న వీడియోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాంతో.. నయనతార దంపతులు విడాకులు తీసుకుంటున్నారన్న రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయ్యింది.


తెలుగు, తమిళం భాషల్లో నయనతార చాలా సినిమాల్లో నటించింది. గతేడాది జవాన్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. షారుఖ్‌ హీరోగా నటించిన ఈ మూవీకి అట్లీ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె స్పోర్ట్స్‌ నేపథ్యంలో వస్తోన్న 'టెస్ట్'‌ సినిమాలో నటిస్తున్నారు. ఆర్ మాధవన్, సిద్ధార్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌. శశికాంత్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Next Story