'అన్నపూర్ణి' సినిమా వివాదం..క్షమాపణలు చెప్పిన నయనతార
ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చిన మూవీల్లో ఒకటి నయనతార నటించిన అన్నపూర్ణి సినిమా.
By Srikanth Gundamalla Published on 19 Jan 2024 12:07 PM IST'అన్నపూర్ణి' సినిమా వివాదం..క్షమాపణలు చెప్పిన నయనతార
ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చిన మూవీల్లో ఒకటి నయనతార నటించిన అన్నపూర్ణి సినిమా. అయితే.. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా మెప్పించలేకపోయింది. కానీ.. ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన తర్వాత మాత్రం ఓ రేంజ్‌లో వ్యూస్‌ను దక్కించుకుంది. కానీ.. అంతలోనే ఒక వివాదంలో ఇరుక్కుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నయనతార నటిచింది. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఈ సినిమా ఉందని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అన్నపూర్ణి క్యారెక్టర్ ఒక బ్రహ్మణ అమ్మాయిగా చూపించారనీ.. ఆ తర్వాత ఆమె నమాజ్ చేయడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు నయనతారపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
తాజాగా ఈ వివాదంపై లేడీ సూపర్ స్టార్ నయనతార స్పందించారు. ఈ మేరకు వివాదంపై స్పందిస్తూ క్షమాపణ లేఖను విడుదల చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లేఖను పోస్టు చేసింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తాను సినిమా తీయలేదని వివరణ ఇచ్చారు. అలాగే తన చిత్రబృందం కూడా భావించిందని చెప్పారు. అయితే.. అన్నపూర్ణి సినిమాలోని కొన్ని సీన్లు హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. శ్రీరాముడిని అవమానిస్తూ లవ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా కొన్ని సీన్లు ఉన్నాయని పలు హిందూసంఘాలు అభ్యంతరం తెలిపాయి. వివాదం పెద్దది కావడంతో.. ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ సినిమాను తొలగించింది.
ఇక ఈ మేరకు స్పందించిన నయనతార.. పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో.. తెలియకుండా ఎవరినైనా బాధపెట్టి ఉంటామనీ.. గతంలో థియేటర్లలో ప్రదర్శించిన చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగిస్తారనే విషయాన్ని తాము ఊహించలేదని చె్పారు. ఎవరి మనోభావాలను కించపరచడం తమ ఉద్దేవం కాదన్నారు. తాను కూడా దేవుడిని విశ్వసిస్తానని చెప్పారు. ఎవరి మనసును బాధపెట్టినా.. వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నట్లు నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. అన్నపూర్ణి సినిమా ఉద్దేశం ప్రజల్లో ప్రేరణ నింపడం.. చైతన్యపరచడం మాత్రమే అని పేర్కొన్నారు.