వివాదంలో నయనతార సినిమా.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ఔట్

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార సినిమా వివాదంలో చిక్కుకుంది.

By Srikanth Gundamalla  Published on  11 Jan 2024 2:00 PM GMT
nayanthara, annapoorani movie, removed,  netflix,

 వివాదంలో నయనతార సినిమా.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ఔట్ 

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార సినిమా వివాదంలో చిక్కుకుంది. థియేటర్లలో పెద్దగా ఆడలేకపోయిన నయనతార సినిమా అన్నపూర్ణి. ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అయ్యింది. మొదట ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్లింది. థియేటర్లతో పోలిస్తే ఓటీటీలో బాగా స్ట్రీమింగ్‌ అయ్యింది. కానీ.. వివాదం మాత్రం ఈ సినిమా ఎక్కరోజులు నెట్‌ఫ్లిక్స్‌లో ఉండేలా చేయలేదు.

నయనతార లీడ్‌రోల్‌లో 75వ చిత్రంగా డిసెంబర్‌లో ప్రేక్షకుల మందుకు వచ్చింది. థియేటర్లో సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఆ తర్వాత నెల రోజులకే ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ తీసుకొచ్చింది. అదే సమయంలో ఓ వివాదంలో ఇరుక్కుంది. ఈ సినిమాలో నయనతార బ్రహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ యువతిగా నటించింది. నాన్‌వెజ్‌ వంటు చేస్తూ పేరు తెచ్చుకోవడంతో పాటు.. ఓ రెస్టారెంట్‌ పెట్టాలని కలలు కంటుంది. ఈ క్రమంలోనే వచ్చే కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ హిందూ అమ్మాయి నమాజ్‌ చేసినట్లుగా సినిమాలో చూపించడం లవ్‌ జిహాద్‌ను ప్రేరేపించేలా ఉందనీ.. మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందంటూ పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. థియేటర్లో విడుదలైన సమయంలో ఈ వివాదం కూడా కొనసాగింది. కానీ ఆ సమయంలో పెద్దగా ప్రచారంలోకి రాలేదు.

తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వడం.. జనాల నుంచి పెద్దఎత్తున స్పందన రావడంతో వివాదం ముదిరింది. ఏకంగా బాయ్‌కాట్‌ నెట్‌ఫ్లిక్స్‌ పేరుతో విమర్శలు వచ్చాయి. ఎక్స్‌ వేదికగా బాయ్‌కాట్‌ నెట్‌ఫ్లిక్స్‌ను ట్రెండింగ్‌ అయ్యింది. ఇదిలా ఉండగా.. శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి నయనతార, ఈ సినిమా మేకర్స్‌పై కేసు పెట్టారు. కేసు కూడా నమోదు అయ్యింది. ఈ వివాదంపై సినిమా నిర్మాతలైన జీ స్టూడియోస్‌ ప్రజలకు, విశ్వహిందూ పరిషత్‌లకు క్షమాపణలు చెప్పారు. అన్నపూర్ణి సినిమాను నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తొలగించింది. అయితే.. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి కొత్త వెర్షన్‌ను ఏమైనా తీసుకొస్తారా? లేదంటే అలాగే వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Next Story