జులై 14న థియేటర్లలో విడుదలైన సినిమా.. 27 నుండి ఓటీటీలో..!
'నాయకుడు' సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
By News Meter Telugu Published on 18 July 2023 8:00 PM ISTజులై 14న థియేటర్లలో విడుదలైన సినిమా.. 27 నుండి ఓటీటీలో..!
తమిళ సినిమా 'మామన్నన్' ఇటీవల బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేశ్, వడివేలు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 29వ విడుదలైంది. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 'నాయకుడు' టైటిల్ తో జులై 14వ తేదీన తెలుగులో విడుదల చేశారు. అయితే ఈ వారం 'బేబీ' సినిమా మేనియా నడుస్తూ ఉండడంతో నాయకుడు సినిమాను తెలుగులో పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి తమిళ, తెలుగు, మలయాళ కన్నడ భాషల్లో 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. తెలుగు థియేటర్స్ కి వచ్చిన రెండు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షం కాబోతోంది. తెలుగులో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు ఓటీటీలలో ఎంజాయ్ చేయొచ్చు.
తమిళంలో మామన్నన్ మూవీ యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలు రిలీజ్ చేశాయి. మామన్నన్ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. రాజకీయాల్లోని అసమానాతల్ని చర్చిస్తూ తెరకెక్కిన నాయకుడు సినిమా బుల్లితెరపై తప్పకుండా ఆకట్టుకుంటుంది.