'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా' గా కన్నడ బ్యూటీ
National crush of India..Rashmika ... కన్నడలో కిరిక్ పార్టీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మంధాన్
By సుభాష్ Published on
20 Nov 2020 8:19 AM GMT

కన్నడలో కిరిక్ పార్టీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మంధాన్న. ఛలో చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. గీతా గోవిందంతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. సరిలేరు నీకెవ్వరుతో తనకు సాటి ఎవరూ లేరని.. భీష్మతో.. తనకు తిరుగలేదని నిరూపించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళ్తుతుంది.
తాజాగా గూగుల్ రష్మికకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. 2020 సంవత్సరానికి గాను 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా రష్మిక ఎన్నికైనట్టు ప్రకటించింది. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని గూగుల్‌లో సెర్చ్ చేయగా.. రష్మిక మందన్న పేరు కనిపిస్తోంది. దాని కింద.. "రష్మిక నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా మారింది. ఆమె ఔట్‌ఫిట్‌లను మేము ఇష్టపడుతాము. కానీ ఇప్పుడు ఆమె రేడియంట్ మేకప్ లుక్‌ని ఇంకా ఇష్టపడుతున్నాము" అని కామెంట్ ఉంది. ఇప్పటివరకూ తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన రష్మిక, తాజాగా, తమిళంలోనూ 'సుల్తాన్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్పస, శర్వానంద్ ఆడోళ్లు మీకు జోహార్లులో చిత్రాల్లో నటిస్తోంది.
Next Story