'నాన్నా.. నువ్వు తప్పించుకోలేవు' అంటోన్న సితార‌.. వీడియో వైర‌ల్‌

Nanna, you can't hide from my camerao..సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ స‌మ‌యం దొరికితే త‌న కుటుంబ స‌భ్యుల‌తో ఉండేందుకే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌

By సుభాష్  Published on  1 Dec 2020 2:25 PM IST
నాన్నా.. నువ్వు తప్పించుకోలేవు అంటోన్న సితార‌.. వీడియో వైర‌ల్‌

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ స‌మ‌యం దొరికితే త‌న కుటుంబ స‌భ్యుల‌తో ఉండేందుకే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. ఇక ఆయ‌న‌కు త‌న కూతురు సితారా అంటే చాలా ఇష్టం. తండ్రీ, కూతురు చేసే చిలిపి అల్ల‌ర్ల‌ను మ‌హేష్ భార్య న‌మ‌త్ర సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సితార.. త‌న తండ్రి మ‌హేష్ బాబుకు సంబంధించి తీసిన వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోలో ఏం ముందంటే.. సితార కెమెరాకు చిక్కకుండా మహేశ్ తప్పించుకునేందుకు ప్రయత్నాలు జరిపాడు. తన ముఖం కనపడకుండా తన చేతులను అడ్డుగా పెట్టుకుని, ముఖాన్ని బెడ్ వైపునకు తిప్పాడు. ఈ వీడియోను త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసిన సితార.. 'నాన్నా.. నా కెమెరా నుంచి నువ్వు తప్పించుకోలేవు' అంటూ కామెంట్ చేసింది.

ప్ర‌స్తుతం మ‌హేష్.. 'సర్కారు వారి పాట' చిత్రంలో న‌టిస్తున్నాడు. గీత గోవిందం ఫేమ్‌ పరుశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే విడుదలైన సర్కారు వారి పాట ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లకు విశేషమైన స్పందన లభించింది. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన ఈ చిత్ర షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించ‌నున్నారు.

Next Story