నాగార్జున కుటుంబం నుంచి రెండో శుభవార్త..!
నటుడు నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెళ్లి విషయమై కీలక ప్రకటన చేశారు.
By Kalasani Durgapraveen Published on 26 Nov 2024 7:19 PM ISTనటుడు నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెళ్లి విషయమై కీలక ప్రకటన చేశారు. పెద్ద కొడుకు నాగ చైతన్య వివాహం మరికొద్ది రోజుల్లో జరగనుండగా.. దీనికి ముందు ఆయన చిన్న కొడుకు అఖిల్ అక్కినేని పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అఖిల్‌కు తన స్నేహితురాలు జైనాబ్ రావ్‌జీతో నిశ్చితార్థం అయినట్లు నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అందుకు సంబంధించిన తాజా చిత్రాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాగార్జున ఆమెను ప్రేమ, ఆశీర్వాదాలతో కుటుంబంలోకి సాదరంగా స్వాగతించారు.
నాగార్జున ఎక్స్ వేదికగా.. జైనాబ్ రావుద్జీతో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం అయినట్లుగా కింగ్ నాగార్జున ప్రకటించారు. జైనాబ్‌ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉంది.. యువ జంటను అభినందించడానికి మాతో చేరండి. వారి ప్రేమకు, ఆనందానికి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు నాగార్జున. అంతేకాదు, కాబోయే నూతన జంట ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు.
ఇదిలావుంటే.. డిసెంబర్ 4న శోభితతో నాగ చైతన్య వివాహం జరుగుతుండగా.. అంతా ఆ సంబరాల్లో మునిగిపోయారు. సడెన్‌గా అఖిల్ నిశ్చితార్థం కూడా పూర్తయిందనే వార్తతో అక్కినేని అభిమానులకు నాగార్జున డబుల్ ట్రీట్ ఇచ్చినట్లయింది. ఇక అఖిల్ నిశ్చితార్థం విషయానికి వస్తే.. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్లుగా తెలుస్తోంది.